తలనొప్పి శారీరక, మానసిక, వివిధ కారణాల వల్ల వస్తూ ఉంటుంది.

అయితే ఒక్కోసారి భరించలేనంత తలనొప్పి వచ్చేస్తుంది. చాలా ఇబ్బంది పెడుతుంది.

బ్లడ్ తక్కువగా ఉండి.. బాగా వీక్​గా ఉండేవాళ్లకి తలనొప్పి తరచూ వస్తుంటుంది.

శరీరంలో కెమికల్స్ కౌంట్ ఎక్కువగా ఉండేవారికి కూడా వాటి రియాక్షన్స్ వల్ల తలనొప్పి రావొచ్చు.

బీపీ పేషెంట్లకు, గ్యాస్ ట్రబుల్, ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారికి.. తలనొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ.

అలాంటి సమయంలో కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే అది కంట్రోల్ అవుతుందట.

బకెట్​లో చల్లని నీళ్లు వేసి.. దానిలో కాళ్లు ఉంచితే తలనొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుంది.

ఉదయం లేదా సాయంత్రం.. తలనొప్పి వచ్చే సమయంలో పావుగంట ఇది చేస్తే నొప్పి కంట్రోల్ అవుతుంది.

లేదంటే పలుచటి టవల్​ని చల్లని నీటిలో తడిపి.. దానిని నడుముకు చుట్టుకోవాలి.

ఈ రెండు ఇంటి చిట్కాలు ఫాలో అయితే తలనొప్పి దాదాపు తగ్గడాన్ని మీరు చూస్తారు.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా పాటిస్తే మంచిది. (Images Source : Envato)