కొందరు బరువు తగ్గాలని చూస్తారు. కానీ కొన్ని మిస్టేక్స్ వల్ల బరువు పెరిగిపోతారు. తెలియకుండా లైఫ్ స్టైల్లో ఫాలో అయ్యే కొన్ని అలవాట్లు వల్ల బరువు పెరుగుతారట. బ్రేక్‌ఫాస్ట్‌ని మానేస్తే బరువు తగ్గుతారు అనుకుంటారు. కానీ ఈ పనివల్ల బరువు పెరుగుతారు. ఎక్సర్సైజ్ అస్సలు చేయకపోయినా కూడా బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొందరు నీటిని చాలా తక్కువగా తాగుతారు. డీహైడ్రేషన్ వల్ల కూడా బరువు పెరుగుతారు. ఆహారాన్ని తొందరగా తినేయడం వల్ల కూడా బరువు పెరుగుతారు. ఎక్కువగా నమిలి మింగితే బరువు కంట్రోల్లో ఉంటుంది. స్వీట్లు ఎక్కువగా తినేవారికి మధుమేహం, ఊబకాయం వచ్చే అవకాశాలు ఎక్కువ. టీ, కాఫీలు, ప్రాసెస్ చేసిన ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే బరువు పెరుగుతారు. నిద్ర కూడా బరువుపై ప్రభావం చూపిస్తుంది. నిద్ర ఎంత తక్కువైతే బరువు అంత పెరుగుతారు. ఇవి అవగాహన కోసమే. నిపుణుల సలహా తీసుకుంటే మంచిది. (Images Source : Envato)