సింపుల్ టిప్స్

బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

Published by: Geddam Vijaya Madhuri

మరణానికి ప్రధానకారణం

మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా రెగ్యూలర్​గా కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. ఎందుకంటే మహిళల్లో క్యాన్సర్ మరణాలకు గల ప్రధాన కారణాల్లో ఇది రెండోది.

హెల్తీ హ్యాబిట్స్

రెగ్యూలర్ లైఫ్​లో కొన్ని అలవాట్లు చేసుకుంటే.. బ్రెస్ట్​ క్యాన్సర్​ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని చెప్తున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్​పై అవగాహన కల్పిస్తూ కొన్ని సూచనలు ఇస్తున్నారు.

బరువు విషయంలో

బరువు ఎక్కువగా ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బరువు విషయంలో ఎలాంటి అశ్రద్ధ చూపించకూడదు. హెల్తీ వెయిట్ మెయింటైన్ చేయాలి.

యాక్టివ్​గా ఉండాలి..

కొందరు చాలా లేజీగా, నీరసంగా ఉంటారు. అలా కాకుండా రెగ్యూలర్​గా యాక్టివ్​గా ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్​ను దూరం చేసుకోవచ్చు. వ్యాయామం, ఎరోబిక్స్ వంటి ఫిజికల్ యాక్టివిటీలు చేయాలి.

హెల్తీ డైట్

మొత్తం ఆరోగ్యాన్ని డైట్​ అనేది ప్రభావితం చేస్తుంది. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ కారకాలను కూడా పెంచుతుంది. అందుకే హెల్తీ ఫుడ్​ని డైట్​లో చేర్చుకోవాలంటున్నారు నిపుణులు.

మంచి నిద్ర

నిద్రలో ఉన్నప్పుడు కొన్ని ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. శరీరం రీసెట్ అవుతుంది. అందుకే మహిళలు కంటినిండా నిద్రపోవాలంటున్నారు. లేదంటే క్యాన్సర్ కారకాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు.

పొగ తాగవద్దు

స్మోకింగ్ బ్రెస్ట్ క్యాన్సర్​తో పాటు.. వివిధ రకాల క్యాన్సర్ కారకాలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి వీలైనంత త్వరగా స్మోకింగ్ మానుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.

మద్యం వద్దు

మద్యాన్ని ఎక్కువగా తీసుకుంటే బీపీ, షుగర్​తో పాటు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉందంటున్నారు. వీలైనంత త్వరగా దీనిని కంట్రోల్ చేయాలంటున్నారు.

వైద్యులను సంప్రదించండి

కొందరు తమ బ్రెస్ట్​లో ప్రాబ్లమ్ ఉంటే వైద్యుల దగ్గరకు వెళ్లేందుకు ఆలస్యం చేస్తారు. ఇది త్వరగా గుర్తిస్తే ట్రీట్​మెంట్ చేయడం సులభంగా ఉంటుంది. లేదంటే ప్రాణాంతకం కావొచ్చు.

అవగాహన

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా పాటిస్తే మంచిది.