ఫ్రీజ్ చేసిన ఎగ్‌ని ప్రెగ్నెన్సీకి ఎలా ఉపయోగిస్తారంటే ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుని.. లేట్‌గా ప్రెగ్నెన్సీ కావాలనుకున్నప్పుడు ఎలా ప్రోసెస్ చేస్తారో తెలుసా? తల్లి నుంచి సేకరించిన ఎగ్‌ని క్రయో బ్యాంక్‌లో ఫ్రీజ్ చేస్తారు. దీనిని ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు వాటిని కరిగించి.. టెస్ట్ చేస్తారు. అనంతరం గుడ్డులోకి స్పెర్మ్ ఇంజెక్ట్ చేస్తారు. దీనినే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ అంటారు. ఎగ్ ఫలదీకరణం చెందుతుంది. గుడ్డు పిండంగా పెరుగుతుంది. ఈ ప్రక్రియను ఎంబ్రియో కల్చర్ అంటారు. ఆ పిండాన్ని మళ్లీ గర్భాశయంలో అమర్చుతారు. అప్పుడు తల్లి బిడ్డ పుట్టేవరకు క్యారీ చేస్తుంది. ఫ్రీజ్ చేసుకున్న ఎగ్‌ని పది సంవత్సరాల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఆ పరిమితి దాటితే కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయంటున్నారు నిపుణులు. ప్రెగ్నెన్సీని లేట్‌గా ప్లాన్ చేసుకునేవారికి ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఓ వరమనే చెప్తున్నారు నిపుణులు. ఫ్యూచర్కోసం కాస్త బోల్డ్‌గా ఆలోచించినా తప్పులేదు కాబట్టి దీనిని చాలామంది స్వాగతిస్తున్నారు. ఇది కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు పాటిస్తే మంచిది. (Images Source : Envato)