రతన్ టాటా కోట్స్

రతన్ టాటా నేర్పిన జీవిత సత్యాలివే

Published by: Geddam Vijaya Madhuri

రతన్ టాటా మోటీవేషనల్ కోట్స్

రతన్ టాటా మనస్తత్వాన్ని చెప్పే కోట్స్ ఎన్నో ఉన్నాయి. అవి ప్రతి మనిషిని ఏదొకరకంగా మోటీవేట్ చేస్తాయి. జీవితంలో ఏది మనచేతుల్లో లేదనిపించినప్పుడు మిమ్మల్ని ముందుకు నడిపే సత్తా వీటికి ఉంది.

ఇనుము.. మనము..

ఇనుమును పాడు చేయడానికి ఏది అవసరం లేదు.. దాని తుప్పు సరిపోతుంది. అలాగే ఓ మనిషి జీవితాన్ని ఎవరూ పాడు చేయనవసరం లేదు.. అతని మైండ్​సెట్​నే జీవితాన్ని పాడుచేస్తుందంటూ None can destroy iron, but its own rust can! Likewise, none can destroy a person, but their own mindset can. ఇది చెప్పారు.

వేగమా? దూరమా?

వేగంగా నడవాలనుకుంటే ఒంటరిగా వెళ్లండి.. కానీ దూరం నడవాలనుకుంటే కలిసి వెళ్లండి. If you want to walk fast, walk alone. But if you want to walk far, walk together. రతన్ టాటా చెప్పిన ఈ కోట్​లో ఓ జీవితమే కనిపిస్తుంది.

లైఫ్​లో రిస్క్ తీసుకోవాలా? వద్దా?

The biggest risk is not taking any risk. In a world that is changing quickly, the only strategy that is guaranteed to fail is not taking risks. మారే కాలానికి అనుగుణంగా జీవితంలో రిస్క్ తీసుకోవాలి. లేకుంటే ముందుకు వెళ్లలేమనేది దీని సారాంశం.

వెళ్లిపోవడమే మంచిది..

The day I can't do something for myself will be the day I pack my bags and leave. సెల్ఫ్ లవ్​ ఇంపార్టెన్స్​ని తెలిపే కోట్​ ఇది. రతన్ టాటా చెప్పిన వాటిలో ఇది బెస్ట్ కోట్​గా చెప్పవచ్చు. మనకోసం, మన పని మనం చేసుకోలేనప్పుడు ఉండడం వేస్ట్​ అనే అర్థం వస్తుంది.

ఇంతే చాలు?

Never stop learning. Keep challenging yourself to grow and evolve. నేర్చుకోవడాన్ని ఎప్పుడూ ఆపకూడదు. ఇది మీకు కచ్చితంగా సక్సెస్​ని ఇస్తుంది.

రైటా? రాంగా?

జీవితంలో ఏ నిర్ణయం తీసుకుంటారనేది కాదు.. I don't believe in taking right decisions. I take decisions and then make them right. మీరు తీసుకున్న నిర్ణయాన్ని ఎలా సరిచేసుకోవాలో తెలిసుండాలి.

చివరికేమవుతుందంటే..

In the end, we only regret the chances we didn't take. జీవితంలో చివరిదశలో మనం ఏదైతే రిస్క్ తీసుకోలేదో.. అనుకున్నది చేయలేదో.. దాని గురించి కచ్చితంగా బాధపడతాము.

నిజమైన సక్సెస్ అదే..

Success is not about the destination, it's about the journey. జీవితంలో సక్సెస్ అంటే సాధించడం కాదు.. దానికోసం ఎన్ని విధాలుగా ప్రయత్నించారు.. దానిని ఎలా చేరుకున్నారనేదే నిజమైన సక్సెస్.