కిస్ చేసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని పలు పరిశోధనలు తెలిపాయి. ముద్దు పెట్టుకునేప్పుడు విడుదలయ్యే ఆక్సిటోసిన్ ఒత్తిడిని తగ్గించి మనసుకు ప్రశాంతతను ఇస్తుందట. డోపమైన్ కూడా విడుదలై.. సంతోషాన్ని ఇచ్చి స్ట్రెస్‌ని దూరం చేస్తుందట. మానసిక స్థితిని మెరుగుపరిచే ఎండార్ఫిన్లు భారాన్ని తగ్గించి మనసును తేలిక చేస్తాయట. శరీరంలో స్ట్రెస్‌ని పెంచే కార్టిసాల్ స్థాయిలు తగ్గి.. బీపీ వంటి సమస్యలు కంట్రోల్ అవుతాయట. అయితే కిస్ అనేది ఫోర్స్ ఫుల్‌గా కాకుండా సున్నితంగా.. సన్నిహితంగా ఉండాలి. ఫాస్ట్‌గా కాకుండా సెన్సెషన్స్ని అర్థం చేసుకుంటూ ముద్దు పెట్టుకుంటే ఒత్తిడి దూరమవుతుందట. పార్టనర్ టచ్, కిస్ టేస్ట్, చేతులు తడిమే ఫీల్‌ని మీరు ఫీల్ అయితే ఇద్దరికీ ఒత్తిడి తగ్గుందని అధ్యయనం చెప్తోంది. వారికి బ్రీతింగ్ స్పేస్‌ని ఇస్తూ.. మసాజ్ చేస్తూ కిస్ చేస్తూ ఉంటే ఇద్దరికీ ఆక్సిటోసిన్ విడుదల అవుతుందట. ఇలా కిస్ చేసుకుంటే ఒత్తిడి తగ్గి.. కొత్త ఎనర్జీతో ముందుకు వెళ్తారట.