జాగ్రత్త

బరువు తగ్గాలని తక్కువగా తింటున్నారా?

Published by: Geddam Vijaya Madhuri

కంట్రోల్ చేయాలి..

బరువు తగ్గాలనుకుంటే చేయాల్సింది ఫుడ్ తగ్గించడం కాదు.. ఫుడ్ కంట్రోల్ చేయడమంటున్నారు నిపుణులు.

సైడ్ ఎఫెక్ట్స్

బరువు తగ్గాలని.. ఫుడ్ తగ్గిస్తే ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటున్నారు. ఇవి పూర్తి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయంటున్నారు.

మజిల్ లాస్..

ఫుడ్​ని తగ్గించి తినడం వల్ల మజిల్ లాస్ ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా ఎముకల్లో దృఢత్వం తగ్గుతుంది. ఈ రెండిటి వల్ల వీక్​ అవుతారు. దానినే బరువు తగ్గడం అనుకుంటారు.

మహిళల్లో

మహిళలు బరువు తగ్గేందుకు ఫుడ్ తగ్గించడం వల్ల హార్మోన్లు డిస్టర్బ్ అవుతాయట. దానివల్ల హార్మోన్ల సమస్యలు, పీసీఓఎస్, పీరియడ్స్ రాకపోవడం వంటివి జరుగుతుంటాయి.

జుట్టు రాలిపోవడం

సరైన పోషకాలు అందక హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది. జుట్టు పూర్తిగా డ్యామేజ్ అవుతుంది.

స్కిన్ డార్క్

అవును బరువు తగ్గాలని ఫుడ్ తగ్గిస్తే స్కిన్ డార్క్ అవుతుందట. పెదాలపై పిగ్మెంటేషన్ ఎక్కువ అవుతుందట.

నిపుణుల సలహా

ఈ సమస్యలు తెచ్చుకుంటూ బరువు తగ్గడం కంటే ప్రోపర్ వేలో బరువు తగ్గితే మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.

వ్యాయామం

రెగ్యూలర్​గా వ్యాయామం చేస్తూ.. హెల్తీగా బరువు తగ్గితే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చని చెప్తున్నారు.

లైఫ్ స్టైల్

లైఫ్​ స్టైల్​లో కొన్ని మార్పులు చేసి.. హెల్తీగా బరువు తగ్గితే స్కిన్ మంచి గ్లో వస్తుందని, జుట్టు మంచిగా ఉంటుందని చెప్తున్నారు.

అవగాహన

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా పాటిస్తే మంచి ఫలితాలుంటాయి. (Images Source : Envato)