రోజంతా నిద్రపోకపోతే ఇంత డేంజరా?

కొన్నిసార్లు వివిధ కారణాల వల్ల కొందరు నిద్రకు దూరమవుతారు.

పగలు, రాత్రి తేడా లేకుండా పనిలో పడి నిద్రపోకపోతే ఏమవుతుందో తెలుసా?

రోజంతా నిద్రపోకుండా ఉంటే శరీరం మీద, బ్రెయిన్ మీద ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసా?

రోజంతా నిద్రపోకపోతే పనిమీద కాన్​సెంట్రేషన్ తగ్గుతుందట.

ఏమైనా గుర్తు చేసుకోవాలన్నా టైమ్​కి గుర్తురావు. సరైన నిర్ణయాలు తీసుకోలేరట.

ప్రతి చిన్నవిషయానికి ఇరిటేట్ అవుతారు. మూడ్ స్వింగ్స్ ఎక్కువ అవుతాయట. ఒత్తిడి కూడా పెరుగుతుందట.

అలసటగా అనిపించి కండరాలలో వీక్​నెస్ పెరుగుతుందట. దీనివల్ల పని చేయలేరు. ఎనర్జీ ఉండదు.

రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీనివల్ల జ్వరం, ఫ్లూ వంటి వచ్చే అవకాశాలు ఎక్కువ.

ఆకలి ఎక్కువగా వేస్తుందట. స్వీట్స్ తినాలనే కోరికతో పాటు హై క్యాలరీ ఫుడ్స్ ఎక్కువగా తినేస్తారట.

ఒక్కరోజు నిద్రపోకపోతే ఇలా ఉందంటే.. రెగ్యూలర్​గా ఇలా చేస్తే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వస్తాయట.

ఒకవేళ ఒక్కరోజే ఈ సమస్య అయితే మళ్లీ మంచి నిద్రతో వాటినుంచి రికవరీ పొందవచ్చట.

ఇవన్నీ అవగాహన కోసమే. నిపుణుల సలహా పాటిస్తే మంచిది. (Images Source : Envato)