చుండ్రు సమస్యను దూరం చేసే చిట్కాలివే
చుండ్రు సమస్య వివిధ కారణాల వల్ల వస్తుంది. అయితే దీనిని కొన్ని టిప్స్ ఫాలో అవ్వడం వల్ల కంట్రోల్ చేయవచ్చు అంటున్నారు.
కొబ్బరి నూనెలో నిమ్మరసం కలపాలి. దీనిని స్కాల్ప్‌కి అప్లై చేసి.. మసాజ్ చేయాలి. అరగంట తర్వాత షాంపూ చేయాలి.
యాపిల్ సైడర్ వెనిగర్ ఓ టేబుల్ స్పూన్ తీసుకుని దానిలో నీటిని వేసి.. జుట్టును వాష్ చేయాలి. అనంతరం షాంపూ చేస్తే సమస్య తగ్గుతుంది.
షాంపూలో టీ ట్రీ ఆయిల్ కలిపి షాంపూతో కలిపి లేదా డైరక్ట్‌గా స్కాల్ప్‌కి అప్లైచేయాలి. దీనివల్ల స్కాల్ప్ సమస్య దూరమై.. జుట్టుకు మంచి పోషణ అందుతుంది.
ఆలివ్ ఆయిల్లో తేనెను కలిపి.. స్కాల్ప్‌కి అప్లై చేయాలి. దీనిని అరగంట ఉంచి.. అనంతరం షాంపూ చేస్తే మంచి ఫలితాలుంటాయి.
వేపాకులను పొడి చేసి.. ఆ పౌడర్ని కొబ్బరి నూనెలో కలిపి స్కాల్ప్‌కి అప్లై చేయాలి. అరగంట తర్వాత షాంపూ చేస్తే స్కాల్ప్ సమస్యలు దూరమవుతాయి.
రెండు టేబుల్ స్పూన్ల మెంతులను రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే గ్రైండ్ చేసి స్కాల్ప్‌కి ప్యాక్ వేసుకోవచ్చు. దీనివల్ల చుండ్రు తగ్గుతుంది. హెయిర్ ఫాలో కంట్రోల్ అవుతుంది.
షాంపూలో రోజ్మెరీ ఆయిల్ కలిపి షాంపూ చేయొచ్చు. లేదా నేరుగా దానిని తలకి అప్లై చేస్తూ ఉంటే చుండ్రు తగ్గుతుంది.
అలోవెరా జెల్‌ని నేరుగా స్కాల్ప్‌కి అప్లై చేస్తే.. జుట్టుకు మంచి పోషణ అందడంతో పాటు.. చుండ్రు సమస్యను దూరం చేస్తుంది.
ఇవేకాకుండా డైట్లో కొన్ని మార్పులు, వ్యాయామం చేస్తూ ఉంటే చుండ్రు సమస్య తగ్గుతుంది.
ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా ఫాలో అయితే మంచి ఫలితాలుంటాయి.