ఆ సమయంలో నీళ్లు తాగితే బరువు తగ్గొచ్చట ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా బ్యూటీ కోసం నీటిని భాగం చేసుకోవాలంటారు. అందుకే రోజూ 7 నుంచి 9 గ్లాసుల నీటిని కచ్చితంగా తాగాలని సూచిస్తారు. అయితే నీటిని ఏ సమయంలో తాగితే ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చో తెలుసా? ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఓ గ్లాసు నీటిని.. లేదా గోరువెచ్చని నీటిని తాగితే చాలా మంచిదట. రాత్రంతా ఏమి తినము కాబట్టి.. నీటితో ఆ ఫాస్టింగ్ని బ్రేక్ చేయాలట. నీటిలో నిమ్మరసం వేసుకుని తాగిన మంచిదే. ఉదయాన్నే ఇలా నీటిని తాగితే మలబద్ధకం కూడా పోతుందట. భోజనం చేసేప్పుడు కాకుండా.. తినేముందు నీటిని తాగితే మంచిదంటున్నారు. దీనివల్ల ఫుడ్ కూడా కంట్రోల్ అవుతుంది. బరువు తగ్గే అవకాశాలున్నాయి. పడుకునే ముందు నీటిని తాగితే బాడీ నిద్రలో డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. దీనివల్ల రక్తప్రసరణ మెరుగై హార్ట్ ఎటాక్స్ రాకుండా ఉంటాయి. స్నానం చేసే ముందు కూడా నీటిని తాగితే ఆరోగ్యానికి మంచిదట. బీపీ కూడా కంట్రోల్ అవుతుంది. ఇవన్నీ అవగాహన కోసమే. ఫాలో అయితే మంచి ఫలితాలు ఉంటాయి.