ఫిట్​నెస్ గోల్స్

బాబీడియోల్ ఫిట్​నెస్ సీక్రెట్స్.. నాలుగు నెలలు అది తినలేదట

Published by: Geddam Vijaya Madhuri

వరుస సినిమాలతో

55 ఏళ్ల వయసున్న బాబీడియోల్.. తన బాడీని మార్చుకోవడమే కాకుండా.. వరుస సినిమాలతో.. మంచి క్యారెక్టర్స్​తో అదరగొడుతున్నాడు. ప్రస్తుతం కంగువ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

అలా మొదలైంది..

యానిమల్ సినిమా కోసం తన లుక్​ని మార్చుకోవాలనుకున్నారు బాబీ. తెరపై ఎప్పుడూ కనిపించని లుక్​కోసం ట్రై చేయాలనుకున్నారు. ఇలా తన ఫిట్​నెస్ జర్నీని మొదలుపెట్టారు.

కండరాలపై దృష్టి

వయసు పెరిగే కొద్ది muscle తగ్గిపోతుంది. ముందు దానిని పెంచుకోవడంపై దృష్టి పెట్టారు. దానికి సంబంధించిన వ్యాయామాలు చేసేవారు. high-intensity వ్యాయామాలు దీనిలో భాగమయ్యాయి.

కార్డియో ఎన్ని నిమిషాలంటే..

రోజూ గంట weight training చేస్తే.. 40 నిమిషాలు కార్డియోలో హై ఇన్​టెన్సిటీ సెషన్స్ చేసేవారు. ఉదయం, సాయంత్రం కూడా ఈ సెషన్స్ ఉండేవి.

డైట్​..

గోల్​కి తగ్గట్లు మొత్తం డైట్​ని మార్చేసుకున్నారు. బ్యాలెన్స్డ్ మీల్స్ తీసుకునేవారు. కార్బ్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్​తో కూడిన ఆహారాన్ని తీసుకునేవారు.

బ్రేక్​ఫాస్ట్​గా

ఉదయాన్నే గుడ్లు తీసుకునేవారు. కార్బోహైడ్రేట్స్ కోసం ఓట్​మీల్​ని డైట్​లో చేర్చుకున్నారు.

లంచ్​కి

మధ్యాహ్న భోజనం సమయంలో ప్రోటీన్ కోసం చికెన్, కొద్దిగా అన్నం తీసుకునేవారు. వీటిని రెగ్యూలర్​గా తీసుకునేవారు.

సాయంత్రం

సలాడ్స్ సాయంత్రం స్నాక్స్​గా.. రాత్రుళ్లు చికెన్ లేదా ఫిష్​ని డైట్​లో తీసుకునేవారు.

అది మాత్రం లేదు..

కానీ నాలుగు నెలలు మాత్రం తనకిష్టమైన స్వీట్స్ జోలికి బాబీ డియోల్ పోలేదట. దీంతో అతను తనకి కావాల్సిన బాడీని పొందారు.

కంగువ కోసం..

కంగువ కోసం కూడా ఇదే రోటీన్​ను ఆయన ఫాలో అయినట్లు ఫిట్​నెస్ ట్రైనర్ తెలిపారు.