ఐదు పదుల వయసులోనూ చెక్కు చెదరని అందం మలైకా సొంతం
మలైకా కచ్చితంగా రోజూ ఉదయాన్నే ఓ డ్రింక్ తాగుతుంది. నిమ్మరసం, తేనెను నీటిలో కలిపి.. పరగడుపునే తాగుతుంది. ఇది శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపిస్తుంది. స్కిన్‌కి మెరుపునిస్తుంది.
ఇవే కాకుండా మెంతులు, జీలకర్ర నీళ్లు కూడా తన రోటీన్లో భాగం చేసుకుంటుంది మలైకా. ఇది కూడా డీటాక్స్ చేసి.. బరువు తగ్గించడంలో, ఇమ్యూనిటీని పెంచి.. మెరిసే చర్మాన్ని అందిస్తుంది.
క్రమం తప్పకుండా మలైకా వ్యాయామం చేస్తుంది. దీనిని రెగ్యూలర్‌గా చేస్తే.. మీ స్కిన్ ఆటోమేటిక్‌గా గ్లో అవుతుంది.
యోగాను మలైకా చాలా ఎక్కువ ప్రమోట్ చేస్తుంది. రెగ్యూలర్ యోగాతో పాటు.. ఫేస్ యోగాలు కూడా ఆమె అందానికి మరింత ప్లస్ అవుతున్నాయని తెలిపింది ఈ భామ.
తేనె, దాల్చిన చెక్క పొడి, నిమ్మరసం కలిపిన పేస్ట్‌ను బాడీ స్క్రబ్‌గా ఉపయోగిస్తానని ఓ ఇంటర్వూలో తెలిపింది.
కాఫీ, షుగర్, కొబ్బరి నూనెతో స్క్రబ్‌ని కూడా తన స్కిన్ కేర్‌లో ఉపయోగిస్తానని తెలిపింది మలైక. అలాగే అలోవెరాను కూడా ఉపయోగిస్తూ ఉంటుంది.
కొబ్బరి నూనె, ఆముదం, ఆలివ్ నూనె కలిపి.. తన జుట్టుకు అప్లై చేస్తుందట. దీనివల్ల జుట్టు హెల్తీ, దృఢంగా, సిల్కీ హెయిర్‌ని అందిస్తుంది.
ఉల్లిపాయ జ్యూస్‌ని స్కాల్ప్ ఆరోగ్యం కోసం ఉపయోగిస్తుంది మలైకా. దాదాపు సహజమైన పదార్థాలనే ఉపయోగిస్తానని తెలిపింది మలైక.
హెల్తీ, న్యూట్రిషియన్స్తో నిండిన ఫుడ్ మెరిసే, అందమైన చర్మాన్ని అందిస్తుంది. అంతేకాకుండా హెల్త్‌ని కూడా బాగా ప్రమోట్ చేస్తుంది. జుట్టు పెరుగుదలకు కూడా ఈ ఫుడ్ హెల్ప్ చేస్తాయి.
జంక్ ఫుడ్, అన్ హెల్తీ డ్రింక్స్‌కి మలైకా దూరంగా ఉంటుంది. అలాగే తను తీసుకునే ఫుడ్‌ని ఆలివ్ నూనెతో కుక్ చేసుకుంటుంది.