లేట్ నైట్ తింటే త్వరగా ముసలివాళ్లు అయిపోతారా?

కొందరు ఫుడ్​ని లేట్​ నైట్​ తింటూ ఉంటారు. అయితే ఇది ఏజింగ్​ అవ్వడంలో ముఖ్యపాత్ర పోషిస్తుందట.

ఇది ఎంతవరకు నిజం. నిపుణులు చెప్తొన్న షాకింగ్ విషయాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

మనం తీసుకున్న ఫుడ్ జీర్ణం కావడానికి రెండు గంటలు సమయం పడుతుంది. నాన్​వెజ్ అయితే మరీ ఎక్కువ టైమ్ తీసుకుంటుంది.

మరి లేట్ నైట్ ఫుడ్ తీసుకుని వెంటనే పడుకుంటే.. దానికి జీర్ణమయ్యే సమయం ఎక్కడ దొరకుతుంది.

కాబట్టి పడుకున్న తర్వాత తిన్న ఫుడ్ జీర్ణమయ్యే ప్రక్రియ నడుస్తూనే ఉంటుంది.

అప్పుడు డైజీషన్ సిస్టమ్ నడుస్తూ ఉంటుంది కానీ.. రికవరీ సిస్టమ్ ఎప్పుడు మొదలవుతుంది?

అందుకే పడుకోవడానికి రెండు, మూడు గంటల ముందు ఫుడ్ తీసుకోవాలని అంటున్నారు నిపుణులు.

నిద్రపోయే సమయానికి డైజీషన్ ప్రొసెస్ అయిపోవాలి. నిద్రలో రికవరీ జరగాలి.

ఇలా చేయడం వల్ల ఏజింగ్ సమస్యలేకాకుండా.. ఆరోగ్య సమస్యలు కూడా దూరమవుతాయంటున్నారు.

ఇవి కేవలం అవగాహన కోసమే నిపుణుల సలహా ఫాలో అయితే మంచిది. (Images Source :Envato)