స్కిన్ లెస్ చికెన్ మంచిదా? స్కిన్​ ఉన్న చికెన్ తినాలా?

చాలామంది స్కిన్ లెస్ చికెన్​ని ఎక్కువగా తింటారు. మరికొందరు చికెన్​కి స్కిన్ ఉండాలంటారు.

ఇంతకీ ఈ రెండిటీలో ఏది మంచిది. స్కిన్ లెస్ చికెనా? స్కిన్ ఉన్న చికెనా?

స్కిన్ లెస్ చికెన్​లో ఫ్యాట్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి.

ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే దీనిని జిమ్​కి వెళ్లేవారు ఎక్కువగా తీసుకుంటారు.

చికెన్​పై స్కిన్ ఉంటే ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. బరువు పెరిగే అవకాశలు ఎక్కువ.

కేలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి. ప్రోటీన్ కూడా తక్కువగా ఉంటుంది.

స్కిన్ లెస్ చికెన్ తక్కువ కేలరీలతో ఉండి బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది.

ఫ్యాట్ తక్కువగా ఉంటుంది కాబట్టి గుండె ఆరోగ్యానికి మంచిది. మజిల్స్ గ్రోత్ బాగుంటుంది.

చికెన్​పై స్కిన్ ఉంటే.. మీట్ జ్యూసీగా మారుతుంది. ఫ్రై చేసుకుంటే మంచి క్రిస్పీనెస్ ఇస్తుంది.

ఈ స్కిన్​లో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఇవి కొన్ని రకాలుగా ఆరోగ్యానికి మంచివి.

స్కిన్ లెస్ చికెన్​ని త్వరగా వండకపోతే డ్రై అయిపోతుంది. కాస్త ఫ్లేవర్ తగ్గుతుంది.

స్కిన్ ఉన్న చికెన్​ వండుకుంటే దానికి మంచి ఫ్లేవర్, క్రిస్పీనెస్ తోడవుతుంది.

మీ ప్రిఫరెన్స్, టేస్ట్ బట్టి.. నిపుణుల సలహాలు తీసుకుని చికెన్ని ఎంచుకోవచ్చు.