దాల్చిన చెక్కతో ఆరోగ్యానికి ఎన్ని లాభాలో.. మధుమేహానికి కూడా
దాల్చిన చెక్కను కాస్త దోరగా వేయించుకుని పొడి చేసుకుని.. ఆ పొడిని స్టోర్ చేసుకుని.. రెగ్యూలర్‌గా తీసుకోంటే చాలా మంచిదట.
దాల్చిన చెక్కపొడి శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. షుగర్ కంట్రోల్ అవుతుంది.
దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఆర్థ్రైటిస్, పీరియడ్ సమయంలో కలిగే నొప్పిని ఇవి దూరం చేస్తాయి.
దాల్చిన చెక్క పొడితో చేసి టీ లేదా కషాయం తాగితే.. బాక్టీరియా వ్యాప్తి అరికట్టవచ్చు. వైరస్, ఫంగస్‌ను దూరం చేసి.. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. దీనివల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడి.. హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు దూరమవుతాయి.
డయేరియా, వాంతులు, జీర్ణ సమస్యలు ఉన్నవారు రెగ్యూలర్‌గా దీనిని తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.
దీనిలోని యాంటీఆక్సిడెంట్లు.. ఫ్లేవనాయిడ్స్ శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను కంట్రోల్ చేస్తాయి. అందుకే క్యాన్సర్ నివారణలో దీనిని ఉపయోగిస్తారు.
పింపుల్స్‌ని తగ్గించి.. స్కిన్ టోన్‌ని మెరుగుపరచడంలో ఇది మంచి ఫలితాలు ఇస్తుంది. జుట్టు పెరుగుదలను కూడా ఇది ప్రమోట్ చేస్తుంది.
రెగ్యూలర్‌గా తీసుకుంటే మెటబాలీజం పెరుగుతుంది. దీనివల్ల బరువు కూడా కంట్రోల్ ఉంటుంది.
పంటి ఆరోగ్యానికి.. మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవడంలో కూడా ఇది మంచి ఫలితాలు ఇస్తుంది.