హెల్త్ బెనిఫిట్స్

పరగడుపునే తమలపాకు తింటే డయాబెటిస్ కంట్రోల్ అవుతోందట తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri

ఖాళీ కడుపుతో తింటే..

తమలపాకును ఖాళీ కడుపుతో తింటే ఆరోగ్యానికి చాలామంచిదంటున్నారు ఆయుర్వేద నిపుణులు. దీనివల్ల కలిగే ఆరోగ్యా ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

న్యూట్రిషనల్ పోషకాలు..

తమలపాకులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో విటమిన్ ఏ,సి, కె ఉంటుంది. కాల్షియం, ఐరన్, పొటాషియం వంటి మినరల్స్ ఉంటాయి.

మధుమేహానికి..

పరగడుపునే తమలపాకు తింటే.. రక్తంలో షుగర్స్ లెవెల్స్ కంట్రోల్​లో ఉంటాయని తెలిపింది నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ తెలిపింది. రెగ్యూలర్​గా మోతాదులో దీనిని తీసుకుంటే మంచిదంటున్నారు.

జీర్ణ సమస్యలకై..

జీర్ణ సమస్యలను దూరం చేయడంలో తమలపాకు మంచి ప్రయోజనాలు అందిస్తుంది. అందుకే భోజనం చేసిన తర్వాత కూడా చాలామంది వీటిని తీసుకుంటూ ఉంటారు.

నొప్పి దూరం..

తమలపాకులో యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి నొప్పి, వాపు, మంటను దూరం చేయడంలో హెల్ప్ చేస్తాయి.

యాంటీ మైక్రోబయాల్

తమలపాకులో యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు ఉంటాయి. బ్యాక్టీరియాలు, వైరస్​లు, ఫంగల్ సమస్యలు రాకుండా మిమ్మల్ని కాపాడుతుంది.

నోటి ఆరోగ్యానికై..

తమలపాకుని ఉదయాన్నే తీసుకుంటే.. నోటినుంచి వచ్చే దుర్వాసన పోతుంది. గమ్ సమస్యలను దూరం చేసి.. నోటి అల్సర్లను దూరం చేస్తుంది.

ఇమ్యూనిటీకై..

తమలపాకుని రెగ్యూలర్​గా తీసుకుంటే.. ఇమ్యూనిటీని పెంచుతుంది. దగ్గు, జలుబు వంటి సమస్యలు దూరమవుతాయి.

అవగాహన..

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు పాటించి.. రెగ్యూలర్​గా తీసుకుంటే మంచిది. (Images Source : Envato)