జుట్టుకి కొబ్బరి నూనె మంచిదా? ఉసిరి నూనె మంచిదా?

జుట్టు హెల్తీగా ఉండాలని అందరూ అనుకుంటారు. దానికి కోసం వివిధ జాగ్రత్తలు తీసుకుంటారు.

జుట్టు పోషణలో నూనె ముఖ్యపాత్ర పోషిస్తుంది. అందుకే ఎలాంటి నూనె వాడితే మంచిదో కచ్చితంగా తెలుసుకోవాలి.

కొబ్బరినూనె, ఉసిరి నూనెను చాలామంది జుట్టుకు రాస్తారు. అయితే వీటిలో ఏది జుట్టు పెరుగుదలకు మంచిది?

కొబ్బరి నూనె స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. హెయిర్ ఫోలికల్స్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది.

ఉసిరి నూనెలో విటమిన్ సి ఉంటుంది. ఇది జుట్టును దృఢంగా చేస్తుంది. చుండ్రును తగ్గిస్తుంది.

ఉసిరితో పోలిస్తే కొబ్బరి నూనె జుట్టుకు ఎక్కువ మాయిశ్చరైజర్​ను అందిస్తుంది. పొడి జుట్టును దూరం చేస్తుంది.

ఆయిల్ హెయిర్ ఉన్నవారికి ఉసిరి నూనె మంచి ఆప్షన్. నూనె ఎక్కువ ప్రొడ్యూస్ కాకుండా అడ్డుకుంటుంది.

కొబ్బరినూనె డ్యామేజ్ అయినా హెయిర్​ని కుదుళ్లనుంచి కాపాడుతుంది.

తెల్లని జుట్టు రాకుండా ఉసిరి నూనె అడ్డుకుంటుంది.

కాబట్టి మీ అవసరాన్ని బట్టి వీటిని మీ హెయిర్ కేర్​ రోటీన్​లో చేర్చుకోండి. (Images Source : Envato)