టోమాటోతో ఫేస్ ప్యాక్.. బెనిఫిట్స్ ఇవే

ముఖానికి సహజంగా ఉపయోగించే ఏ ప్యాక్ అయినా మంచి ప్రయోజనాలే ఇస్తాయి.

అలాంటి వాటిలో టోమాటో ఒకటి. దీనితో ఫేస్ ప్యాక్ చేసి అప్లై చేస్తే మంచి బెనిఫిట్స్ ఉంటాయి.

టోమాటోల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్, న్యూట్రిషన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి స్కిన్​కి చాలా మేలు చేస్తాయి.

మరి ఈ ప్యాక్​ని ఎలా తయారు చేసుకోవాలి? దీనివల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో చూసేద్దాం.

టోమాటో ప్యాక్ ముఖంపై మచ్చలను తగ్గించి.. చర్మాన్ని క్లియర్ చేస్తుంది.

ఓపెన్ పోర్స్​ను క్లోజ్ చేసి.. చర్మాన్ని ముడతలు లేకుండా చేస్తుంది. మృదువైన చర్మాన్ని అందిస్తుంది.

దీనిలోని విటమిన్ సి కొల్లాజిన్​ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది చర్మ ఆరోగ్యానికి మంచిది.

ఆయిల్ స్కిన్ ఉన్నవారికి ఇది బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. పింపుల్స్ తగ్గుతాయి.

ఎండలో తిరిగితే వచ్చే ఎర్రని మచ్చలు, టాన్​ని టోమాటో దూరం చేస్తుంది.

స్కిన్​ని ఎక్స్​ఫోలియేట్ చేసి.. చర్మంపై ఉన్న మృతుకణాలను తొలిగిస్తుంది.

ఫ్రీరాడికల్స్​ నుంచి స్కిన్​ని కాపాడి.. చర్మానికి మంచి గ్లో ఇస్తుంది. (Images Source : Envato)