పీరియడ్స్ సమయంలో పైనాపిల్ తింటే చాలా మంచిదట

పీరియడ్స్​ సమయంలో చాలామందికి పొత్తికడుపు నొప్పి, నడుం నొప్పి వంటి సమస్యలుంటాయి.

దానిని తగ్గించుకునేందుకు చాలామంది పెయిన్ కిల్లర్స్, హాట్ బ్యాగ్స్ ఉపయోగిస్తుంటారు.

కానీ మీరు నొప్పి తగ్గించుకునేందుకు పైనాపిల్​ను కూడా తీసుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

పైనాపిల్​లోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. బ్రోమెలైన్ ఎంజైమ్స్ కూడా ఉంటాయి.

ఇవి పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని దూరం చేసి.. కండరాలకు విశ్రాంతినిస్తాయట.

పైనాపిల్​లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది.

పీరియడ్స్ సమయంలో ఎక్కువ బ్లీడ్ అవ్వడాన్ని ఇది కంట్రోల్ చేస్తుంది.

ఒత్తిడి, యాంగ్జైటీని దూరం చేస్తుంది పైనాపిల్. హార్మోనల్ సమస్యలు దూరమవుతాయి.

పీరియడ్స్ రోజుల్లో కడుపు ఉబ్బరం ఉంటుంది. జీర్ణ సమస్యలు ఉంటాయి.

పైనాపిల్​లోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలను దూరం చేస్తాయి.

హెవీ పీరియడ్స్ వల్ల రక్తహీనత వస్తుంది. దీనిని దూరం చేసి.. బలహీనతను పోగొడుతుంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు పాటిస్తే మంచిది. (Images Source : Envato)