గెడ్డం పెంచుకోవాలనుకుంటున్నారా? ఈ టిప్స్ మీకోసమే క్లీన్ షేవ్ ఉంటే మంచి ఇంప్రెషన్ ఉంటాదనే రోజుల నుంచి.. మా పిల్లకి గెడ్డమంటే ఇష్టమనే రోజులొచ్చాయి. పైగా ఇది నవంబర్. ఈ నెలలో నో షేవ్ నవంబర్‌ని కూడా చాలా మంది ఫాలో అయితారు. మరి ఈ సయమంలో గెడ్డాన్ని పెంచుకునేందుకు కొన్ని టిప్స్ ఫాలో అయితే మంచి లుక్ మీ సొంతమవుతుంది. గెడ్డం పెంచుకునే ముందు డెర్మటాలజిస్ట్‌ని కలిస్తే మంచిది. స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు దీనిని అవాయిడ్ చేయవచ్చు. హైడ్రేటెడ్‌గా ఉండేందుకు నీటిని తాగాలి. రోజూ 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోండి. పెంచుకున్న గెడ్డాన్ని రెండు, మూడు వారాలకోసారి మైల్డ్ షాంపూతో క్లీన్ చేసుకోవాలి. గెడ్డం రఫ్‌గా ఉండకుండా.. కండీషనర్ లేదా బియర్డ్ ఆయిల్ ఉపయోగిస్తే మంచి కండీషన్లో ఉంటుంది. గెడ్డాన్ని అలా వదిలేయకుండా.. రెగ్యూలర్‌గా దువ్వుకుంటూ.. స్ప్లిట్స్ లేకుండా ఎండ్స్ కట్ చేస్తే లుక్ బాగుంటుంది. గెడ్డానికి మసాజ్ చేస్తూ.. బయోటిన్, విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకుంటే మంచి గ్రోత్ ఉంటుంది. గెడ్డం పెరగడానికి టైమ్ పడుతుంది. కాబట్టి కెమికల్స్ వాడకపోవడమే మంచిది. ఇవి అవగాహన కోసమే. మీరు నిపుణుల సలహాలు తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.