బరువు తగ్గాలంటే వీటిని అవాయిడ్ చేయండి బరువు తగ్గాలంటే కొన్ని రెగ్యూలర్‌గా ఎలా ఫాలో అవ్వాలో.. అలాగే కొన్నింటిని అవాయిడ్ చేయాలట. బేక్ చేసిన ఫుడ్స్ అంటే కేక్స్, బిస్కెట్లు, పంచదార, ఫ్యాట్స్‌తో నిండిన ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. సెరల్స్‌లో షుగర్ ఎక్కువగా, ఫైబర్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి హెల్తీ కాదు. వీటి జోలికి వెళ్లకూడదు. సోడాలు, డ్రింక్స్‌లలో షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో షుగర్ లెవెల్స్‌ని పెంచుతాయి. ప్యాక్ చేసిన ఫుడ్స్‌లో ప్రిజెర్వేటివ్స్, సోడియం, పంచదార ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని తీసుకోకపోవడమే బెటర్. యోగర్ట్ ఆరోగ్యానికి మంచిదే కానీ.. ఫ్లేవర్ యోగర్ట్స్ని తీసుకోకపోవడమే బెటర్. వీటిలో షుగర్ ఉంటుంది. వైట్ బ్రెడ్‌లో ఫైబర్ తక్కువ ఉంటుంది. ఇది ఆకలిని కూడా పెంచుతుంది కాబట్టి మల్టీగ్రైన్ బ్రెడ్ బెటర్ ఆప్షన్. చిప్స్, ప్యాక్ చేసిన స్నాక్స్‌లలో ఫ్యాట్, షుగర్ ఉంటుంది. వీటికి దూరంగా ఉంటే బెటర్. ఈ ఫుడ్స్ అన్ని బరువును పెంచుతాయి కాబట్టి.. బరువు తగ్గాలనుకుంటే వీటికి దూరంగా ఉండాలి. ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా ఫాలో అయితే మంచిది. (Images Source : Envato)