ఉసిరికాయలు తింటే చర్మానికి, జుట్టుకు కలిగే ప్రయోజనాలివే

కార్తీకమాసంలో ఉసిరికాయలు విరివిగా దొరుకుతాయి. అయితే వీటితో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి.

హెల్త్​కే కాకుండా జుట్టు, చర్మానికి కూడా దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని చెప్తున్నారు.

దీనిలోని యాంటీఆక్సిడెంట్లు స్కిన్ డ్యామేజ్ కాకుండా కాపాడుతాయి. కొల్లాజెన్​ను పెంచుతుంది.

ఉసిరిలోని విటమిన్ సి స్కిన్​ టోన్​ని మెరుగుపరుస్తుంది. హైపర్ పిగ్మెంటేషన్​ని తగ్గిస్తుంది.

పింపుల్స్ రాకుండా, ముడతలు రాకుండా దీనిలోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు కాపాడుతాయి.

చర్మాన్ని హైడ్రేట్ చేసి.. స్కిన్​ని మృదువుగా చేస్తుంది. యాంటీ ఏజింగ్ లక్షణాలు దూరం చేస్తుంది.

హెయిర్ ఫాలికల్స్ దెబ్బతినకుండా కాపాడి జుట్టు పెరుగుదలను ప్రమోట్ చేస్తుంది.

జుట్టు పొడిబారడాన్ని తగ్గించి.. మృదువుగా, మాయిశ్చర్​గా ఉండేలా చేస్తుంది.

చుండ్రును తగ్గించి.. దురదను దూరం చేస్తుంది. స్కాల్ప్​ సమస్యలను దూరం చేస్తుంది.

జుట్టు తెల్లబడడాన్ని దూరం చేసి.. జుట్టును స్ట్రాంగ్​ చేస్తుంది. స్ప్లిట్ ఎండ్స్ తగ్గించి జుట్టు రాలకుండా చేస్తుంది.

ఇవి అవగాహన కోసమే. నిపుణుల సలహా ఫాలో అయితే మంచి ఫలితాలుంటాయి.