రోజుకు ఎన్ని బాదం తినొచ్చో తెలుసా? ఎక్కువ తింటే వచ్చే నష్టాలివే బాదంలు ఆరోగ్యానికి, అందానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. అలాగే శరీరంలో కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేయడానికి కూడా ఇవి హెల్ప్ చేస్తాయి. మోతాదుకు మించి తీసుకుంటే బరువు పెరిగి.. కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదముందని చెప్తున్నారు నిపుణులు. సరైన మోతాదులో తీసుకుంటేనే మంచి ఫలితాలుంటాయి. మరి వీటిని రోజుకు ఎన్ని తీసుకోవచ్చు? పెద్దవాళ్లు అయితే రోజులో హెల్తీ స్నాక్‌గా.. 20 నుంచి 25 బాదంలు తీసుకోవచ్చట. అదే పిల్లులు అయితే పది బాదంలు తినవచ్చని చెప్తున్నారు. భోజన సమయంలో.. ఉదయం లేదా సాయంత్రం సమయంలో దీనిని హ్యాపీగా తినవచ్చని చెప్తున్నారు. రాత్రి నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటే మంచి ఫలితాలుంటాయని చెప్తున్నారు. ముఖ్యంగా కొలెస్ట్రాల్ తగ్గుతుందట. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయం చేస్తాయి. ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా ఫాలో అయితే మంచిది. (Images Source : Envato)