Parenting Tips for Kids : పిల్లలు మంచిగా ప్రవర్తించేలా తల్లిదండ్రులు నేర్పించాల్సిన విషయాలివే
Well Behaved Kids : పిల్లలు ఎలా బిహేవ్ చేస్తున్నారనేది కచ్చితంగా తల్లిదండ్రుల పెంపకంపై ఆధారపడి ఉంటుంది. వారికి మంచి అలవాటయ్యేలా చూసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్‌దే.
Essential Parenting Tips for Raising a Well-Rounded Child : కొందరు పిల్లలు చాలా మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేస్తారు. మరికొందరు పిల్లలు చాలా అల్లరి చేస్తూ ఉంటారు. పిల్లలు అల్లరి చేయడం తప్పే కాదు. కానీ.. ఇతరులు ఉన్నప్పుడు వారు బిహేవ్ చేసే విధానంపై పేరెంట్స్ కచ్చితంగా బాధ్యత తీసుకోవాలి. నలుగురిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలో వారికి నేర్పించాలి. ఇవి నేర్పించడానికి వారిని కొట్టేయాల్సిన, బెదిరించేయాల్సిన అవసరం లేదు. ప్రేమగా వారికి చిన్నప్పటినుంచే కొన్ని విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉండాలి.
తల్లిదండ్రులకు తెలియని విషయం ఏమిటంటే.. పిల్లలు తమ అలవాట్లను తమ చుట్టూ ఉన్నవారి నుంచే ఎక్కువగా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్లో మీరు ఎంత హుందాగా వ్యవహరిస్తే వారిలో అంత మంచి బిహేవియర్ బిల్డ్ అవుతుంది. లేదంటే వారు చెడు మార్గంలో వెళ్లే అవకాశాలు ఎక్కువ. బలవంతంగా మర్యాద నేర్పించాల్సిన అవసరం లేదు. ఇంట్లో మీరు ఉండే విధానం పద్ధతి మార్చుకుంటే చాలు. అవి ఎలా ఉండాలంటే..
బౌండరీలు సెట్ చేయాలి..
పిల్లలకు పేరెంట్స్ కొన్ని బౌండరీలు సెట్ చేయాలి. ఇది చేస్తేనే అది దక్కుతుంది. లేదా ఇది కంప్లీట్ చేసినప్పుడే మీరు గేమ్ ఆడుకోవచ్చు వంటివి సెట్ చేయాలి. అలా చేసినప్పుడే తమకి నచ్చింది దొరుకుతుందని.. పిల్లలు కష్టపడతారు. దీనివల్ల క్రమశిక్షణ పెరుగుతుంది. అంతేకానీ పిల్లలు ఏడుస్తున్నారని వారికి నచ్చిందల్లా ఇచ్చేయకూడదు. తర్వాత వారు మీరు ఎంత ఇచ్చినా.. మారం చేస్తూనే ఉంటారు.
సహనం..
తల్లిదండ్రుల నుంచే పిల్లలు కొన్ని అలవాట్లు నేర్చుకుంటారు. అలాంటివాటిలో సహనం ఒకటి. ఇతరులను మీరు ఎలా గౌరవిస్తున్నారో.. మీ పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. పేరెంట్స్ సహనం మరచిపోయి పిల్లల ముందు ఎప్పుడూ గొడవపడకూడదు. ఇతరులతో మంచి, మర్యాదగా మీరు బిహేవ్ చేస్తే.. మీ పిల్లలు అదే నేర్చుకుంటారని గుర్తించుకోండి.
కమ్యూనికేషన్
చాలామంది పిల్లల విషయంలో చేసే అతి పెద్ద తప్పు ఏంటంటే కమ్యూనికేట్ చేయరు. దీనివల్ల పిల్లలు చాలా విషయాలు తమలోపలే దాచేసుకుంటారు. తర్వాత వారిని అర్థం చేసుకోవడం చాలా కష్టమవుతుంది. కాబట్టి.. పిల్లలు మీ దగ్గర ఏ విషయాన్ని అయినా షేర్ చేసుకునే ఫ్రీడమ్ ఇవ్వండి. దీనివల్ల వారు మానసికంగా కూడా హ్యాపీగా ఉంటారు. నిరాశ ఉంటే పోతుంది. ఇది వారి ప్రవర్తనను మెరుగుపరచడంతో పాటు.. పేరెంట్స్‌తో అనుబంధాన్ని పెంచుతుంది.
గుర్తింపు..
పిల్లలు ఏదైనా క్రియేటివ్‌గా చేస్తే.. ఇలా ఎందుకు చేశావు అని కాకుండా వారికి మంచి ప్రశంస ఇవ్వండి. లేదంటే ఇలా కాకుండా అలా చేయొచ్చని మీ సలహాలు, గైడెన్స్ ఇవ్వండి. ఇలా మీరు గైడ్ చేయడం వల్ల వారిలో క్రియేటివిటీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అలా కాకుండా మీరు వారిని తిట్టారనుకోండి.. వారిలో నెగిటివిటీ ఎక్కువ అవ్వొచ్చు.
క్రమశిక్షణ..
క్రమశిక్షణ నేర్పించడానికి కొట్టేయాల్సిన అవసరం లేదు. తిట్టి చెప్పాల్సిన పని లేదు. పిల్లలతో కూర్చోని.. వారికి ఎగ్జాంపుల్స్ ఇస్తూ కూడా క్రమశిక్షణను నేర్పించవచ్చు. ఒకరు అలా చేసి ఇబ్బంది పడ్డారు. కాబట్టి మనం అలా చేయొచ్చా? లేదా? అంటూ వారినే అడిగితే.. సెల్ఫ్ జడ్జ్మెంట్ వారికే వస్తుంది. ఇలా చేయడం వల్ల ఏదైనా పని చేసేముందు అది తప్పా? కాదా అని ఆలోచిస్తారు.
టైమ్ ఇవ్వండి
పిల్లలతో చాలామంది టైమ్ స్పెండ్ చేయరు. బిజీగా ఉన్నామంటూ పిల్లలతో సరిగ్గా టైమ్ స్పెండ్ చేయరు. కానీ వారితో కనీసం చదువు గురించి ఇతర సీరియస్ విషయాల గురించి డిస్కషన్ లేకుండా.. టైమ్ స్పెండ్ చేయండి. వారితో గేమ్స్ ఆడండి. దీనివల్ల పిల్లలు, మీరు కూడా క్వాలిటీ టైమ్‌ని స్పెండే చేసినవారవుతారు. అలాగే మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు.
ఆస్తులు, అధికారం వంటి వాటి గురించి పిల్లలతో డిస్కస్ చేయకపోవడమే మంచిది. అందరూ ఒకటే అనే ధోరణిలోనే వారిని పెంచాలి. వయసుకు తగిన పనులు చెప్పడం.. వాటిని పూర్తి చేయాలని.. లేకుంటే ఎందుకు పూర్తి కాలేదో చెప్పాలని సూచించాలి. ప్రశాంతతో, సహనంగా ఉండేలా.. ఇచ్చిన పనులు పూర్తి చేసుకునేలా వారిని తీర్చిదిద్దాలి.
ఏ పిల్లాడు ఒకేలా ఉండడు. కాబట్టి.. మీరు పిల్లల విషయంలో చాలా ఓర్పు, సహనంతో ఉండాలి. ప్రతి విషయాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నించాలి.
Also Read : X-ray, CT స్కాన్, MRIకి మధ్య ఉన్న తేడాలివే.. వీటిలో ఏది బెస్టో తెలుసా?