Smriti 50 In 27 Balls: స్మృతి సంచలన ఇన్నింగ్స్.. 27 బంతుల్లో ఫిఫ్టీ.. ఆర్సీబీకి రెండో విజయం.. 8 వికెట్లతో ఢిల్లీ చిత్తు
ఛేజింగ్ లో ఆర్సీబీకి అదిరే ఆరంభం దొరికింది. స్మృతి దూకుడైన ఆటతీరు ప్రత్యర్థి బౌలర్లు బెంబేలెత్తారు. బౌండరీల వర్షం కురిపించి, కేవలం 27 బంతుల్లోనే స్మృతి ఫిఫ్టీ చేసుకుంది.

RCB'S 2nd Win: డబ్ల్యూపీఎల్ తాజా సీజన్లో దూకుడు మీదున్న డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సత్తా చాటుతోంది. టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని సాధించింది. సోమవారం వడొదర వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్ లో ఎనిమిది వికెట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ ను చిత్తు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. 19.3 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. జెమీమా రోడ్రిగ్స్ (22 బంతుల్లో 34, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. అయితే మిగతా బ్యాటర్లు రాణించక పోవడంతో ఢిల్లీ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. బౌలర్లలో రేణుకా సింగ్, జార్జియా వారెహిమ్ లకు మూడేసి వికెట్లు దక్కాయి. అనంతరం ఛేదనను కేవలం 16.2 ఓవర్లలో 146 -2తో బెంగళూరు ఛేదించింది. కెప్టెన్ కమ్ ఓపెనర్ స్మృతి మంధాన విధ్వంసకర ఇన్నింగ్స్ (47 బంతుల్లో 81, 10 ఫోర్లు, 3 సిక్సర్లు)తో సత్తా చాటడంతో మరో 22 బంతులు మిగిలి ఉండగానే ఆర్సీబీ విజయం సాధించింది. శిఖా పాండే పొదుపుగాబౌలింగ్ చేసి, ఒక వికెట్ సాధించింది. ఈ విజయంతో వరుసగా రెండు విజయాలతో పట్టికలో అగ్రస్థానాన్ని మరింతగా ఆర్సీబీ పటిష్టం చేసుకుంది. రేణుక సింగ్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
Efficient 🤝 Effective
— Women's Premier League (WPL) (@wplt20) February 17, 2025
Purple Cap holder Renuka Singh Thakur wins the Player of the Match award for her clinical spell 👌👌
Scorecard ▶ https://t.co/CmnAWvkMnF#TATAWPL | #DCvRCB | @RCBTweets pic.twitter.com/kU0n5k1Imw
తడబడిన ఢిల్లీ..
బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్న పిచ్ పై ఢిల్లీ బ్యాటర్లు మెరవలేక పోయారు. ఆరంభంలోనే స్టార్ బ్యాటర్ షెఫాలీ వర్మ డకౌట్ అయ్యింది. కెప్టెన్ మెగ్ ల్యానింగ్ (17) నెమ్మదిగా ఆడింది. ఉన్నంతంలో జెమీమా దూకుడుగా ఆడి ఆ తర్వాత పెవిలియన్ కు చేరింది. ఈ దశలో అన్నాబెల్ సదర్లాండ్ (19), వికెట్ కీపర్ బ్యాటర్ సారా బ్రైస్ (23) జట్టును ఆదుకునే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఈ మ్యాచ్ లో ఐదుగురు ఓవర్ సీస్ ప్లేయర్లతో ఢిల్లీ బరిలోకి దిగడం విశేషం. ఆస్ట్రేలియాకు చెందిన ల్యానింగ్, సదర్లాండ్, జెస్ జోనాసెన్ , దక్షిణాఫ్రికాకు చెందిన మారిజానే కాప్, స్కాంట్లాండ్ ప్లేయర్ సారా బ్రైస్ లకు తుదిజట్టులో చోటు కల్పించారు. బౌలర్లలో కిమ్ గార్త్, ఏక్తా బిస్త్ లకు రెండేసి వికెట్లు దక్కాయి.
#WPL #Rcb @mandhana_smriti ❤pic.twitter.com/YeX8B9Ebp8
— Cult (@Cult277732595) February 17, 2025
27 బంతుల్లోనే ఫిఫ్టీ..
ఛేజింగ్ లో ఆర్సీబీకి అదిరే ఆరంభం దొరికింది. స్మృతి దూకుడైన ఆటతీరు ప్రత్యర్థి బౌలర్లు బెంబేలెత్తారు. బౌండరీల వర్షం కురిపించి, కేవలం 27 బంతుల్లోనే స్మృతి ఫిఫ్టీ చేసుకుంది. స్మృతి జోరుకు పవర్ ప్లేలోనే 57 పరుగులును పిండుకున్న ఆర్సీబీ.. వంద పరుగులను కేవలం 10 ఓవర్లలోనే సాధించింది. మరో ఎండ్ లో ఓపెనర్ డేని వ్యాట్ హోడ్జ్ (42) యాంకర్ రోల్ పోషిస్తూ, స్మృతికి ఎక్కువగా స్ట్రైక్ ఇచ్చింది. దీంతో తొలి వికెట్ కు రికార్డు స్థాయిలో 107 పరుగులు జతయ్యింది. మరో ఎండ్ లో స్మృతి రెచ్చిపోవడంతో టార్గెట్ వేగంగా కరుగుతూ వచ్చింది. విజయానికి మరో 9 పరుగుల దూరంలో ఉండగా స్మృతి ఔటయ్యింది. స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో ఆమె ఔటయ్యింది. ఎలీస్ పెర్రీ (7 నాటౌట్), రిచా ఘోష్ (11 నాటౌట్)) జట్టును వేగంగా విజయ తీరాలకు చేర్చారు. తెలుగు ప్లేయర్ ఆరుంధతి రెడ్డికి ఒక వికెట్ దక్కింది.
Read Also: Kolhi Vs RCB: కెప్టెన్సీ విషయంలో ఆర్సీబీది సరైన నిర్ణయమే.. కోహ్లికి ఆ రకంగా మేలు..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

