By: Arun Kumar Veera | Updated at : 22 Mar 2025 03:57 PM (IST)
01 ఏప్రిల్ 2025 నుంచి అమలు ( Image Source : Other )
Unified Pension Scheme Details In Telugu: కేంద్ర ఉద్యోగులకు "హామీతో కూడిన పింఛను" (Guaranteed pension) అందించే 'ఏకీకృత పెన్షన్ పథకం' (UPS) ఏప్రిల్ 01, 2025 (నూతన ఆర్థిక సంవత్సరం) నుంచి ప్రారంభం కానుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 2025 ఏప్రిల్ 01న లేదా ఆ తర్వాత ఎప్పుడైనా దీని కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జాతీయ పెన్షన్ వ్యవస్థ (NPS) కింద, 'పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ' (PFRDA) నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఏకీకృత పెన్షన్ పథకం కోసం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏప్రిల్ 01 నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా లేదా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయినా దరఖాస్తు చేసుకోవచ్చు. UPS కోసం అప్లై ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఇంట్లోనే ప్రశాంతంగా కూర్చుని ఆన్‌లైన్‌లోనే పని పూర్తి చేయవచ్చు. ఆన్‌లైన్‌లో అప్లై చేయడానికి ప్రోటీన్ CRA పోర్టల్ (https://npscra.nsdl.co.in) ను సందర్శించాలి. లేదా, మీ ఫారాన్ని పూరించి ఆఫ్‌లైన్‌లో కూడా సమర్పించవచ్చు. అంటే, మీరు పూరించిన ఫారాన్ని మీరు పని చేసే విభాగం ప్రధాన కార్యాలయంలో లేదా మీ 'డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్' (DDO) ద్వారా సమర్పించవచ్చు.
ఏకీకృత పెన్షన్ పథకం ఇతర వివరాలు
ఏకీకృత పెన్షన్ పథకం కింద లభించే కనీస పెన్షన్ మొత్తం 10,000 రూపాయలు. కనీసం 25 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఈ పథకం ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. UPS పరిధిలోని ఉద్యోగి మరణిస్తే, పెన్షన్ మొత్తంలో 60 శాతాన్ని అతని కుటుంబ సభ్యులకు ఇస్తారు.
యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కోసం ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు? (Who can apply for the Unified Pension Scheme?)
NPS కవరేజ్‌లోని ఉద్యోగులు UPS కిందకు వస్తారు.
ఏప్రిల్ 01, 2025 వరకు సర్వీసులో ఉన్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు NPS కిందకు వస్తారు.
కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో కొత్తగా నియమితులైన ఉద్యోగులు కూడా NPS పరిధిలోకి వస్తారు.
NPS కవరేజ్‌లో ఉండి మార్చి 31, 2025 నాటికి పదవీ విరమణ చేసిన లేదా స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న లేదా ఫండమెంటల్ రూల్ 56(j) కింద పదవీ విరమణ చేసిన రిటైర్డ్ ఉద్యోగులు UPSకి అర్హులు.
ఉద్యోగి పదవీ విరమణ తర్వాత - UPSను ఎంచుకునే ముందు మరణిస్తే, అతను/ఆమె చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్య/భర్త ఈ పథకంలో చేరవచ్చు.
యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కింద రిజిస్ట్రేషన్ కోసం నింపాల్సిన వివిధ ఫారాలు
మీరు ఇప్పటికీ ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంటే మీరు ఫారం A2 నింపాలి.
మీరు ఇటీవల ప్రభుత్వ ఉద్యోగంలో చేరితే, UPS కోసం ఫారం A1 నింపాలి.
పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు ఫారం B2 నింపాలి.
పెన్షనర్ మరణిస్తే, అతను లేదా ఆమె జీవిత భాగస్వామి ఫారం B6 నింపాలి.
Multiple Credit Cards: ఎక్కువ క్రెడిట్ కార్డులుంటే క్రెడిట్ స్కోర్ పెరుగుతుందా, తగ్గుతుందా?
Dividend: 17 నెలల పసివాడు సంపాదించిన డివిడెండ్ రూ.3.3 కోట్లు - ఎవరీ ఏకాగ్ర?
Gold Creates New Records: 7 రోజుల్లో 5 రికార్డ్‌లు బద్ధలు - అక్షయ తృతీయ నాడు రేటు ఎలా ఉండొచ్చు?
Cheaper Life Insurance: చవకైన జీవిత బీమా కావాలా?, ఈ 7 సింపుల్ ట్రిక్స్ ప్రయత్నించండి
Multibagger Stock: ఆశ్చర్యం, ఐదేళ్లలో రూ.లక్ష ఒకటిన్నర కోట్లుగా మారింది - ఇప్పుడు 'ఉచితం'గా షేర్లు, డబ్బు!
AP DSC Notification 2025: గతంలో డీఎస్సీకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
JD Vance India Visit: ఫ్యామిలీతో భారత పర్యటనకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్- ఢిల్లీలో భద్రత పెంచిన పోలీసులు
Online Betting Case: వైసీపీ నేతపై ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ కేసు నమోదు, స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి గాలిస్తున్న పోలీసులు
Odela 3: 'ఓదెల 3' ట్విస్ట్ రివీల్ చేసిన సంపత్ నంది... తిరుపతి ఆత్మ మళ్ళీ ఎందుకు వచ్చిందంటే?