YouTube Earnings : యూట్యూబ్‌లో 5,000 వ్యూస్ వస్తే ఎంత డబ్బు వస్తుంది? అసలు నిజం ఇదే
YouTube Monetization : యూట్యూబ్ క్రియేటర్లకు ఈరోజుల్లో మంచి ఆదాయం వస్తుంది. అందుకే వారు వీడియోలు చేసి డబ్బు సంపాదిస్తున్నారు. మరి ఒక వీడియోకి 5000 వ్యూస్ వస్తే ఎన్ని డబ్బులు వస్తాయి?

YouTube Pay : యూట్యూబ్ ద్వారా చాలా మంది బాగా సంపాదిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వచ్చిన ఒక నివేదిక ప్రకారం.. భారతదేశంలోని ఓ యూట్యూబ్ ఛానెల్ AIతో వీడియోలను రూపొందించి సంవత్సరానికి 38 కోట్ల రూపాయలు సంపాదించినట్లు తేలింది. ఇలాంటి సమయంలో మీరు కూడా యూట్యూబ్‌లో వీడియోలను అప్‌లోడ్ చేసి డబ్బు సంపాదించవచ్చు. ప్రత్యేకత ఏమిటంటే.. యూట్యూబ్ ప్రతి సింగిల్ వ్యూకి క్రియేటర్‌కు డబ్బు చెల్లిస్తుంది. అయితే దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి. వాటి గురించి క్రియేటర్‌కు తెలియడం ముఖ్యం. ఈరోజు మీ వీడియోలకు 5,000 వ్యూస్ వస్తే ఎంత సంపాదించవచ్చో మేము మీకు తెలియజేస్తాము.
యూట్యూబ్ నుంచి ఎలా సంపాదించాలి
యూట్యూబ్ పే-పర్-వ్యూ సిస్టమ్ ద్వారా క్రియేటర్ సంపాదిస్తారు. అయితే ఇది పేరుకు ఉన్నంత సులభం కాదు. వాస్తవానికి యూట్యూబ్ మీ వీడియోలకు వచ్చిన వ్యూస్ కోసం కాకుండా.. వీడియోలో ప్లే అయ్యే యాడ్స్‌కు వచ్చిన వ్యూస్ ఆధారంగా డబ్బు చెల్లిస్తుంది. దీని అర్థం మీ వీడియోకు 10,000 వ్యూస్ వచ్చినా.. దానిపై ఎటువంటి యాడ్స్ లేకపోతే మీకు ఆదాయం ఉండదు. అదే సమయంలో మీ వీడియోలో ప్లే అయ్యే యాడ్స్‌కు 5,000 వ్యూస్ వస్తే.. ఆ 5,000 వ్యూస్‌కు మాత్రమే మీకు డబ్బు వస్తుంది.
వీడియో వ్యూస్ ఆధారంగా ఎంత డబ్బు వస్తుందంటే..
వీడియో వ్యూస్ ద్వారా ఎంత సంపాదించవచ్చనేదానికి ఖచ్చితమైన సమాధానం లేదు. మీరు యూట్యూబ్ అన్ని నియమాలను పాటిస్తే.. సబ్‌స్క్రైబర్‌లు, వీడియో రీచ్, ఆడియన్స్, ఎంగేజ్‌మెంట్ ఆధారంగా మీ ఆదాయం నిర్ణయిస్తారు. అయినప్పటికీ 5,000 వ్యూస్ వస్తే 25-75 డాలర్ల వరకు సంపాదించవచ్చని అంచనా.
యూట్యూబ్ నుంచి ఇలా కూడా సంపాదించవచ్చు
మీరు యూట్యూబ్‌లో కేవలం వీడియోలను పోస్ట్ చేయడం ద్వారానే కాకుండా.. సంపాదించడానికి అనేక ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. మీరు యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో చేరి యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఫీజు, ఛానెల్ మెంబర్‌షిప్, మర్చండైజ్ మొదలైన వాటి ద్వారా డబ్బు సంపాదించవచ్చు. అదేవిధంగా మీరు ఛానెల్ మెంబర్‌షిప్, స్పాన్సర్డ్ కంటెంట్, అఫిలియేట్ మార్కెటింగ్ వంటి మార్గాల ద్వారా కూడా సంపాదించవచ్చు.






















