అన్వేషించండి

Richest Woman in History : ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలు.. ఎలెన్ మస్క్, జెఫ్ బెజోస్ ఆస్తులు కలిపినా కూడా తక్కువేనట

History’s Richest Female Ruler : చైనా మహారాణి వూ చరిత్రలో అత్యంత ధనిక మహిళగా చెప్తారు. ఆమె ఆస్తి ముందు ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్ ఆస్తి జుజుబీ అంటున్నారు. దీనిలో నిజమెంత?

Wealthiest Woman in World History : ప్రపంచంలో అత్యంత ధనవంతుల గురించి మాట్లాడేటప్పుడు.. ఎలాన్ మస్క్(Elon Musk), జెఫ్ బెజోస్(Jeff Bezos) లేదా ముఖేష్ అంబానీ (Mukesh Ambani), గౌతమ్ అదానీ (Gowtham Adaani) వంటి పేర్లు వస్తాయి. కానీ చరిత్రలో ఒక మహిళా ధనవంతురాలు కూడా ఉంది. ఆమె సంపద ముందు నేటి బిలియనీర్లు చాలా చిన్నవారుగా కనిపిస్తారు. ఈ మహిళ చైనా మహారాణి వూ (Empress Wu). ఆమె ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలిగా చెప్తారు.

మీడియా నివేదికలు, చారిత్రక అధ్యయనాల ప్రకారం.. మహారాణి వూ మొత్తం సంపద సుమారు 16 ట్రిలియన్ అమెరికన్ డాలర్లుగా అంచనా. ఈ మొత్తం నేటి కాలంలో ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, ఇతర పెద్ద పారిశ్రామికవేత్తల సంపదను కలిపినా కూడా చాలా ఎక్కువ. అందుకే ఆమెను చరిత్రలో అత్యంత ధనవంతురాలైన మహిళా చక్రవర్తి అని పిలుస్తారు.

తాంగ్ రాజవంశంతో ముడిపడి ఉన్న మహారాణి వూ 

మహారాణి వూ చైనాలోని తాంగ్ రాజవంశానికి చెందినవారు. సుమారు 15 సంవత్సరాలు పాలించారు. Money.com, ఇతర చారిత్రక వనరుల ప్రకారం.. ఆమె అత్యంత ధనవంతురాలే కాకుండా.. చైనా ఏకైక మహిళా చక్రవర్తిగా కూడా చెప్తారు. ఆమె పాలనలో చైనా మధ్య ఆసియా వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరించింది.

అధికారం కోసం క్రూరత్వం, కుట్రలు

చరిత్రకారుల ప్రకారం.. మహారాణి వూ చాలా తెలివైన, కఠినమైన పాలకురాలు. అధికారాన్ని నిలుపుకోవడానికి ఆమె తన సొంత కుటుంబ సభ్యులను, పిల్లలను కూడా చంపించిందని అనేక నివేదికలు పేర్కొన్నాయి. రాజు అనారోగ్యంతో ఉన్న తర్వాత మొత్తం పాలన ఆమె చేతిలోకి వచ్చిందని.. ఆ తర్వాత ఆమె వ్యతిరేకతను అణచివేసిందని చెబుతారు. 684 ADలో రాజకుటుంబానికి చెందిన సుమారు 12 మంది సభ్యులను చంపించిన ఆరోపణలు కూడా ఆమెపై ఉన్నాయి. ఆమె దేశవ్యాప్తంగా గూఢచారులు, రహస్య పోలీసుల బలమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది. దీనితో చిన్న తిరుగుబాటు భయం ఉన్నా ప్రజలకు శిక్ష విధించేవారు.

పేదల సహాయానికి కూడా పేరుగాంచింది

ఒకవైపు ఆమెను క్రూరమైన పాలకురాలిగా పరిగణిస్తున్నప్పటికీ.. మరోవైపు చాలా మంది ఆమెను పేదల శ్రేయోభిలాషిగా కూడా చెబుతారు. పేదల సహాయం కోసం ఆమె అనేక పథకాలను ప్రారంభించి.. పరిపాలనా సంస్కరణలు చేసిందని నమ్ముతారు. అందుకే చరిత్రలో ఆమె ప్రతిష్ట ఒకేసారి కఠినమైన, దయగల పాలకురాలిగా పేరుగాంచింది.

విద్యావంతురాలు, దూరదృష్టి గల పాలకురాలు 

మహారాణి వూ ఉన్నత విద్యావంతురాలు. పాలన నిర్వహణలో లోతైన అవగాహన కలిగి ఉన్నారు. ఆమె కాలంలో టీ, పట్టు వ్యాపారంలో అద్భుతమైన వృద్ధి కనిపించింది. ఇది చైనా ఆర్థిక వ్యవస్థకు పెద్ద ప్రయోజనాన్ని చేకూర్చింది. ఆమె జీవితంపై అనేక పుస్తకాలు, సినిమాలు, టీవీ సిరీస్‌లు వచ్చాయి. వీటిలో ప్రసిద్ధ టీవీ సిరీస్ Empress of China కూడా ఒకటి.

నేటి బిలియనీర్లతో పోలిస్తే..

నేటి కాలంలో ఎలాన్ మస్క్ మొత్తం సంపద సుమారు 235 బిలియన్ డాలర్లు. జెఫ్ బెజోస్ సంపద సుమారు 150 బిలియన్ డాలర్లుగా చెప్తారు. మరోవైపు మహారాణి వూ సంపద వీటన్నింటినీ కలిపినా కూడా అనేక రెట్లు ఎక్కువ. అందుకే చరిత్రలో ఆమె పేరు ఎల్లప్పుడూ ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలైన మహిళగానే ఉంటుంది. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Advertisement

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget