బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
గోదావరి జిల్లాల ప్రజలకు బెంగుళూరు వెళ్ళాలి అంటే అందుబాటులో ఉన్న బెస్ట్ ట్రైన్ గా శేషాద్రి ఎక్స్ ప్రెస్ నే చెబుతారు. అయితే నరసాపురం నుండి బెంగళూరు కు మరో ట్రైన్ ఉందన్న సంగతి చాలా మందికి తెలియదు. ఒకపక్క శేషాద్రి లో టికెట్స్ దొరక్క ఇబ్బంది పడే జనాలకు నరసాపురం ఎక్స్ ప్రెస్ మంచి రిలీఫ్ ఇస్తుంది. అయితే దీనికి మరికొంత పబ్లిసిటీ కలిగిస్తే నరసాపురం, భీమవరం, కైకలూరు, గుడివాడల నుంచి బెంగళూరుకు ప్రయాణించే ప్రయాణికులకు చాలా బాగా ఉపయోగపడుతుంది. 07153/54 నెంబర్ తో నడిచే ఈ వీక్లీ ట్రైన్స్ ను డైలీ ట్రైన్స్ గా మారిస్తే శేషాద్రి పై ప్రెజర్ కూడా తగ్గుతుంది అంటారు ప్రయాణికులు. ఈ విషయాన్ని వివరిస్తూ స్పెషల్‌గా బెంగళూరు నుండి నరసాపురం వరకూ ప్రయాణించే ఈ నరసాపురం ఎక్స్‌ప్రెస్ ట్రైన్ లో ప్రత్యేకంగా ఫుల్ vlog చేయడం జరిగింది. ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి.





















