Daksharamam Lord Shiva Idol Vandalised | ద్రాక్షారామం కోనేరు వద్ద శివలింగం ధ్వంసం | ABP Desam
ముక్కోటి ఏకాదశి నాడు ద్రాక్షారామంలో ఘోర అపచారం వెలుగు చూసింది. ద్రాక్షారామం ప్రధాన ఆలయంలోని కోనేరు వద్ద భక్తుల పూజలు అందుకునే కపిలేశ్వర స్వామి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. హరిహరులకు ప్రీతిపాత్రమైన వైకుంఠ, ముక్కోటి ఏకాదశి రోజున స్వామి వారి అభిషేకం కోసం వచ్చిన అయ్యప్పస్వాములు శివలింగం పానవట్టం ధ్వంసమై ఉండటాన్ని గుర్తించారు. జరిగిన అపచారంపై అయ్యప్పస్వాములు ఆగ్రహం వ్యక్తం చేయగా..ఆలయ అధికారుల ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా స్వయంగా ఆలయానికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ ను రప్పించి వివరాలు సేకరిస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు నాలుగు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించిన ఎస్పీ సమీపంలో ఉన్న సీసీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్న పోలీసులు తెలిపారు. నిత్యం పూజించే శివ లింగాన్ని ఈ రీతిలో ధ్వంసం చేసిన నిందితులను తక్షణమే గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలంటూ భక్తులు డిమాండ్ చేస్తున్నారు.





















