Iran War Updates: నెతన్యాహు వీడియోలు ఓకే - మరి ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ వీడియోలు ఎక్కడ - నిజంగానే కోమాలో ఉన్నారా?
Iran new supreme leader : ఇరాన్ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ వారసుడిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన మోజ్తాబా ఖమేనీ ఎక్కడ ఉన్నారన్నది సస్పెన్స్ గా మారింది.ఆయన రష్యాకు పారిపోయారని ప్రచారం జరుగుతోంది

Iran new supreme leader secretly flown to Russia : ఇరాన్ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ వారసుడిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన మోజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తాను క్షేమంగా ఉన్నానని వరుస వీడియోలు విడుదల చేస్తున్న తరుణంలో, కొత్త సుప్రీం లీడర్ ఎందుకు బయటకు రావడం లేదన్నది చర్చనీయాంశంగా మారింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, మోజ్తాబా ఖమేనీ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని, ఆయనకు అత్యవసర శస్త్రచికిత్స కోసం అత్యంత రహస్యంగా రష్యాకు తరలించినట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రపంచ మీడియా కథనాల ప్రకారం, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు చెందిన ఒక విలాసవంతమైన ప్యాలెస్‌లో మోజ్తాబా ఖమేనీకి శస్త్రచికిత్స జరుగుతోంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేసిన వేళ, భద్రతా కారణాల దృష్ట్యా , మెరుగైన వైద్యం కోసం ఆయనను మాస్కోకు తరలించినట్లు తెలుస్తోంది. ఇరాన్ ప్రభుత్వం ఈ విషయాలను గోప్యంగా ఉంచుతున్నప్పటికీ, ఆయన అదృశ్యం వెనుక అనారోగ్య సమస్యలే ప్రధాన కారణమని అంతర్జాతీయ గూఢచారి సంస్థలు అనుమానిస్తున్నాయి.
🇮🇷🇷🇺 According to Kuwaiti news organization Al-Jarida, Iran’s new supreme leader, Mojtaba Khamenei, after suffering injuries during joint U.S.-Israeli strikes, was secretly transported to Moscow and underwent surgery there.
— The Daily News (@DailyNewsJustIn) March 15, 2026
According to reports, he is currently still in Russia. pic.twitter.com/RVkCHutdnU
ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్‌లోని వ్యూహాత్మక లక్ష్యాలపై దాడులు చేస్తున్న తరుణంలో, దేశ నాయకుడు ప్రజల ముందుకు వచ్చి ధైర్యం చెప్పాల్సి ఉంటుంది. కానీ మోజ్తాబా ఖమేనీ వీడియో సందేశాలు కూడా ఇవ్వకపోవడం ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఒకవేళ ఆయన అనారోగ్యానికి గురైతే, ఇరాన్‌లో అధికార మార్పిడి మళ్లీ సంక్షోభంలో పడే అవకాశం ఉంది. మరోవైపు, రష్యా సహకారంతో ఆయనను క్షేమంగా ఉంచేందుకు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
There are reports Iran's new Supreme Leader Mojtaba Khamenei has been evacuated to Moscow after being injured by missile strikes. #iran #tehran #mojtabakhamenei #evacuation #middleeast pic.twitter.com/eNYKlP6oVj
— 7NEWS Australia (@7NewsAustralia) March 15, 2026
ప్రస్తుతం ఇరాన్ ప్రభుత్వం మోజ్తాబా ఖమేనీ క్షేమంగా ఉన్నారని చెబుతున్నా, దానికి సంబంధించిన ఆధారాలను వీడియో లేదా ఫోటోలు విడుదల చేయడంలో విఫలమవుతోంది. నెతన్యాహు తన ఉనికిని చాటుకుంటూ ఇరాన్ బలహీనతను ఎత్తిచూపుతుంటే, ఇరాన్ చీఫ్ అజ్ఞాతంలో ఉండటం ఆ దేశ ప్రతిష్టను దెబ్బతీస్తోంది. రష్యాలోని పుతిన్ ప్యాలెస్‌లో జరుగుతున్న ఈ లైఫ్ సేవింగ్ సర్జరీ సక్సెస్ అయితే తప్ప ఆయన మళ్ళీ ప్రజల ముందుకు వచ్చే అవకాశం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు






















