అన్వేషించండి

East Godavari Crime News: తూర్పుగోదావరి జిల్లాలో వివాహిత‌ మ‌ర్డ‌ర్ అండ్ రేప్ కేసులో రాజ‌మండ్రి కోర్టు సంచ‌ల‌న తీర్పు; మృగాళ్ల‌కు జీవిత ఖైదు,జ‌రిమానా!

East Godavari Crime News:  2024లో సంచ‌ల‌నం సృష్టించిన మృతి కేసులో రాజ‌మండ్రి మూడో అద‌న‌పు జిల్లా కోర్ట్ జడ్జి ఈ కేసులో వాదోపవాదాల అనంతరం సోమ‌వారం సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తూర్పుగోదావరిలో మహిళ హత్య కేసులో నలుగురికి జీవితఖైదు.
  • 2024లో బుర్రిలంకలో రౌతు కస్తూరిపై గ్యాంగ్ రేప్, హత్య జరిగింది.
  • నిందితులకు జీవితఖైదుతో పాటు జరిమానా కూడా విధించారు.
  • కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించిన అధికారులను ఎస్పీ అభినందించారు.

East Godavari Crime News:  2024 సంవత్సరంలో తూర్పుగోదావ‌రి జిల్లా క‌డియం మండ‌లం బుర్రిలంక గ్రామంలో సంచలనం రేపిన రౌతు కస్తూరి హత్య (గ్యాంగ్ రేప్ & మర్డర్) కేసులో కోర్టు తీర్పు వెల్లడించింది. నిందితుల‌కు జీవిత ఖైదు, జరిమానా విధించింది. ఈ కేసుకు సంబంధించి వివ‌రాలు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ వెల్ల‌డించారు. 

సంచ‌ల‌నంగా మారిన మ‌హిళ హ‌త్య కేసు..      

కడియం మండలం బుర్రిలంక  గ్రామానికి చెందిన రౌతు కస్తూరి అనే వివాహిత 2024 అక్టోబ‌ర్ 15వ తేదీన హత్యకు గురైంది. మధ్యాహ్నం 2:00 సమయంలో పని కోసం బుర్రిలంక  వంతెన  దగ్గరలో గల  పాఠం శెట్టి రాముడు నర్సరీలోకి  ప‌నికి వెళ్లింది. సాయంత్రం 6 గంటలు అయినా ఇంటికి రాకపోవడంతో  భర్త ఫోన్ కంగారు పడ్డాడు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ రావ‌డంతో చుట్టుపక్కల వెతికారు. ఆచూకీ దొరిక‌ని ప‌రిస్థితుల్లో మ‌రుస‌టి రోజు కడియం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వివాహిత అదృశ్యంగా  కేసు నమోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. కేసు దర్యాప్తులో ఉండగా 2024 అక్టోబ‌ర్ 17న  కస్తూరి మృతదేహం చొప్పెల్ల  లాకులు వద్ద  ల‌భ్యమైంది. మృతదేహాన్ని రాజమండ్రి ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి తరలించి కేసును అనుమానాస్ప‌ద మృతి కేసుగా నమోదు చేసి పోస్ట్ మార్టం జ‌రిపించారు..

అత్యాచారం, హత్య

న‌ర్స‌రీ ప‌నికి వెళ్లి అనుమానాస్ప‌దంగా మృతి చెందిన వివాహిత కేసు స్థానికంగా తీవ్ర సంచ‌ల‌నంగా మారింది. దీంతో పోలీసులు ద‌ర్యాప్తును మ‌రింత వేగం పెంచారు. అక్కడ ల‌భ్య‌మైన సీసీ కెమెరాలు ఇత‌ర ఆధారాలతో ద‌ర్యాప్తు చేస్తున్న క్ర‌మంలో కీల‌క విష‌యాలు వెలుగు చూశాయి. 2024 అక్టోబ‌ర్ 15న సాయంత్రం సుమారు 5:30 గంటల సమయంలో పని ముగించుకొని వెళ్తున్న క్రమంలో ఆమెను హత్య చేశారు. నర్సరీ మొక్కల మధ్యలో మద్యం సేవిస్తూ వ్యక్తులు ఆమె కాళ్లు చేతులు పట్టుకుని సామూహిక అత్యాచారం చేశారు. తరువాత హత్య చేశారు. తర్వాత పక్కనే ఉన్న కాలువలోకి విసిరేసినట్లు విచారణలో వెల్లడైంది. బుర్రిలంకకు చెందిన‌ దేవర యేసు (26), వెలుబుడి ప్రవీణ్ (21) లోకిన జయ ప్రసాద్ (19) 
పొట్టిలంక గ్రామానికి చెందిన దాసరి సురేష్(22) ఈ దారుణానికి పాల్ప‌డిన‌ట్లు నిర్దారణైంది. వీరిని అరెస్ట్‌చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. నిందితులంతా 26 ఏళ్ల‌లోపు వారే కావ‌డం అప్ప‌ట్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. 

జీవిత ఖైదు-జ‌రిమానా 

2024లో సంచ‌ల‌నం సృష్టించిన ఈ ఘ‌ట‌న‌లో సౌత్ జోన్ డి.ఎస్.పి భవ్య కిషోర్ నేతృత్వంలో నిందితుల‌ను అరెస్ట్ చేసి ఛార్జ్‌షీట్ ఫైల్ చేశారు. రాజ‌మండ్రి మూడో అద‌న‌పు జిల్లా కోర్ట్ జడ్జి ఈ కేసులో వాదోపవాదాల అనంతరం సోమ‌వారం సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించారు. దేవర యేసు, వెలుబుడి ప్రవీణ్, లోకిన జయ ప్రసాద్, దాసరి సురేష్ నలుగురికి జీవిత ఖైదు,  ఒక్కొక్కరికి రూ.2000/- చొప్పున జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష విధించారు. 

అధికారుల‌ను అభినందించిన ఎస్పీ..

ఈ కేసులో ముద్దాయిలకు జీవిత ఖైదు పడటంలో ముఖ్యపాత్ర వహించిన ఏపీపీకే రాధ కృష్ణ రాజు, సౌత్ జోన్ డి.ఎస్.పి ఎస్. భవ్య కిషోర్, క‌డియం ఎస్సై బి నాగ దుర్గ ప్రసాద్, కే శ్రీనివాస్‌ను అభినందించారు.  దర్యాప్తునకు సహకరించి సాక్ష్యులను కోర్ట్‌కు హాజరు అయ్యేలా చేసిన క‌డియం సీఐ ఏ వెంకటేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్, కానిస్టేబుల్ వాసు, భీమారావు ను ఎస్పీ డి. నరసింహ కిషోర్ అభినందించి, రివార్డులు ప్రకటించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan vs Prakash Raj: డీలిమిటేషన్ బిల్లుపై ఢీ అంటే ఢీ! పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్‌ మధ్య సోషల్ మీడియా వార్!
డీలిమిటేషన్ బిల్లుపై ఢీ అంటే ఢీ! పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్‌ మధ్య సోషల్ మీడియా వార్!
Vasamsetti Subhash : మంత్రి వాసంశెట్టి సుభాష్‌ ఇలాఖాలో తండ్రి పెత్త‌నం! టీడీపీకి న‌ష్టం జరుగుతోందని కేడర్‌ అసహనం!
మంత్రి వాసంశెట్టి సుభాష్‌ ఇలాఖాలో తండ్రి పెత్త‌నం! టీడీపీకి న‌ష్టం జరుగుతోందని కేడర్‌ అసహనం!
Dindi - Chinchinada Bridge: నెల‌లు దాటినా పూర్తికాని దిండి- చించినాడ వంతెన మ‌ర‌మ్మ‌త్తు ప‌నులు! ఇబ్బందులు పడుతున్న జనం!
నెల‌లు దాటినా పూర్తికాని దిండి- చించినాడ వంతెన మ‌ర‌మ్మ‌త్తు ప‌నులు! ఇబ్బందులు పడుతున్న జనం!
Narasapuram -Tirupati Train: నరసాపురం -తిరుపతి మధ్య కొత్త ఎక్స్ ప్రెస్ వచ్చేసింది! టైమింగ్స్ ఇవే!
నరసాపురం -తిరుపతి మధ్య కొత్త ఎక్స్ ప్రెస్ వచ్చేసింది! టైమింగ్స్ ఇవే!
Advertisement

వీడియోలు

IPL 2026 GT vs KKR Highlights | గుజ‌రాత్ హ్యాట్రిక్ విజ‌యం
IPL 2026 KKR vs Gujarat Titans Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
IPL 2026 KKR vs GT Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
Shubman Gill GT vs KKR IPL 2026 | అదరగొట్టిన కెప్టెన్ శుభమన్ గిల్
Shubman Gill Success Secret Revealed IPL 2026 | శుబ్మన్ గిల్ సక్సెస్ సీక్రెట్ ఇదే
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan vs Prakash Raj: డీలిమిటేషన్ బిల్లుపై ఢీ అంటే ఢీ! పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్‌ మధ్య సోషల్ మీడియా వార్!
డీలిమిటేషన్ బిల్లుపై ఢీ అంటే ఢీ! పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్‌ మధ్య సోషల్ మీడియా వార్!
Strait of Hormuz:
"హర్మూజ్‌ జలసంధి మూసివేస్తాం" శాంతి చర్చలకు సిద్ధమవుతున్న వేళ ఇరాన్ వార్నింగ్! ట్రంప్ తీరుపై ఆగ్రహం!
PM Kisan Yojana: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నిధుల విడుదలపై బిగ్ అప్‌డేట్! ఈ రైతులకు నిరాశే!
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నిధుల విడుదలపై బిగ్ అప్‌డేట్! ఈ రైతులకు నిరాశే!
Womens vote bank politics: మహిళలకు కాంగ్రెస్ కూటమి వ్యతిరేకం - బీజేపీ చెప్పేది ఇదే - ఎలా కౌంటర్ ఇచ్చుకుంటారు?
మహిళలకు కాంగ్రెస్ కూటమి వ్యతిరేకం - బీజేపీ చెప్పేది ఇదే - ఎలా కౌంటర్ ఇచ్చుకుంటారు?
Hyderabad Bus Fire: ఆగని ట్రావెల్ బస్‌ అగ్ని ప్రమాదాలు! స్లీపర్స్‌పై నిషేధానికి పెరుగుతున్న డిమాండ్! ఆ దేశాలే ఆదర్శం!
ఆగని ట్రావెల్ బస్‌ అగ్ని ప్రమాదాలు! స్లీపర్స్‌పై నిషేధానికి పెరుగుతున్న డిమాండ్! ఆ దేశాలే ఆదర్శం!
Ashwagandha Leaves Banned: అశ్వగంధ ఆకులపై నిషేధం! ఆహార ఉత్పత్తుల్లో వాడొద్దని FSSAI ఆదేశం!
అశ్వగంధ ఆకులపై నిషేధం! ఆహార ఉత్పత్తుల్లో వాడొద్దని FSSAI ఆదేశం!
Vishnu Manchu: గాయం మానింది కానీ గుర్తులు చెరిగిపోలేదు... మంచు విష్ణు
గాయం మానింది కానీ గుర్తులు చెరిగిపోలేదు... మంచు విష్ణు
Krithi Shetty: సినిమా ఫ్లాపే కానీ కృతి శెట్టి గ్లామర్ హిట్టు
సినిమా ఫ్లాపే కానీ కృతి శెట్టి గ్లామర్ హిట్టు
Embed widget