అన్వేషించండి

Jeevan Reddy: జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!

టీ. జీవన్ రెడ్డి అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే జీవన్ రెడ్డి అనే రీతిలో జగిత్యాల నియోజకవర్గంలో రాజకీయం సాగింది. అయితే, గత కొంత కాలంగా పార్టీ అంతర్గత పరిణామాలు ఆయనను తీవ్రంగా కలిచి వేస్తున్నాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి, బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు.
  • 40 ఏళ్ల కాంగ్రెస్‌ ప్రస్థానం తర్వాత అసంతృప్తితో పార్టీ మారనున్నారు.
  • జగిత్యాల బహిరంగ సభలో బీఆర్‌ఎస్‌లో చేరికపై ప్రకటన చేయనున్నారు.
  • జీవన్ రెడ్డి చేరికతో బీఆర్‌ఎస్‌కు ఉత్తర తెలంగాణలో బలం చేకూరనుంది.

Jeevan Reddy: తెలంగాణ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నేతగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్రవేసుకున్న మాజీ మంత్రి టీ. జీవన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. గత నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకలా నిలిచిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి చేయి ఇచ్చి బీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ పరిణామం జగిత్యాల జిల్లాలోనే కాకుండా ఉత్తర తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. 

40 ఏళ్ల అనుబంధం- అగాధంగా మారిన అసంతృప్తి 

టీ. జీవన్ రెడ్డి అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే జీవన్ రెడ్డి అనే రీతిలో జగిత్యాల నియోజకవర్గంలో రాజకీయం సాగింది. అయితే, గత కొంత కాలంగా పార్టీ అంతర్గత పరిణామాలు ఆయనను తీవ్రంగా కలిచి వేస్తున్నాయి. ముఖ్యంగా రెండేళ్ల క్రితం బీఆర్‌ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన ప్రస్తుత జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌తో జీవన్ రెడ్డికి పొసగడం లేదు. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు జెండా మోసిన తనకు కాకుండా, పక్క పార్టీ నుంచి వచ్చిన వారికి అధిష్ఠానం ప్రాధాన్యత ఇవ్వడంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జగిత్యాల మున్సిపల్ ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపు నుంచి చైర్‌పర్శన్‌ పదవి వరకు అన్ని నిర్ణయాల్లోనూ సంజయ్‌ కుమార్ వర్గానికి పెద్ద పీట వేశారని, దీని వల్ల జీవన్ రెడ్డికి పార్టీలో ప్రాధాన్య తగ్గుతూ వచ్చిందని ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తను కాదని సంజయ్‌ కుమార్‌కు నియోజకవర్గ పగ్గాలు అప్పగించడం, స్థానిక నిర్ణయాల్లో తన ప్రమేయం లేకుండా పోవడం ఆయనను తీవ్రంగా బాధించింది. 

గౌరవం లేని చోట కొనసాగలేను: జీవన్ రెడ్డి అంతరంగం 

తనకు, తనను నమ్ముకున్న అనుచరులకు పార్టీలో కనీస గౌరవం, ప్రాధాన్యత దక్కడం లేదని జీవన్ రెడ్డి భావిస్తున్నారు. సీనియర్‌ నేతా తన సలహాలను పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాముఖ్యత ఇవ్వడం ఆయనకు మింగుడుపడటం లేదు. ఈ క్రమంలోనే ఆయన తన సన్నిహితులు, ముఖ్య అనుచరులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. పార్టీలో మనకు గుర్తింపు లేనప్పుడు ఇక్కడ కొనసాగడం కంటే ప్రత్యామ్నాయం చూసుకోవడమే ఉత్తమం అనే అభిప్రాయానికి ఆయన వచ్చినట్టు సమాచారం. 

ఆయన సోషల్ మీడియా ఖాతాల నుంచి కాంగ్రెస్ పేరును తొలగించడం, తన అనుచరుల సోషల్ మీడియా పోస్టులు పార్టీ మార్పును ధృవీకరిస్తున్నట్టు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ బహిరంగంగా మాత్రం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు అని ఆయన కొంత సమయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. 

జగిత్యాల సభలో కారు ఎక్కనున్న జీవన్ రెడ్డి!

రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ నెల 25న జగిత్యాలలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని జీవన్‌ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఈ వేదికపైనే ఆయన తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి, వేలాది మంది అనుచరులతో కలిసి బీఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బీఆర్‌ఎస్ అగ్రనేతలు కేసీఆర్‌, కేటీఆర్‌తో టచ్‌లో ఉన్నారని సమాచారం. పార్టీలో ఆయనకు సముచిత స్థానం, తగిన గౌరవం ఇస్తామని బీఆర్‌ఎస్ అధిష్ఠానం నుంచి గట్టిగా హామీ లభించినట్టు తెలుస్తోంది. 

బీఆర్‌ఎస్‌కు కొత్తజోష్‌- కాంగ్రెస్‌కు షాక్

జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేత పార్టీని వీడటం కాంగ్రెస్‌కు పెద్ద షాక్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గంలో ఆయనకు పటిష్టమైన క్యాడర్ ఉంది. ఆయన నిర్ణయం వల్ల కాంగ్రెస్‌ బలం తగ్గే అవకాశం ఉండగా, బీఆర్‌ఎస్‌కు ఇది ఉత్తర తెలంగాణలో పెద్ద బూస్ట్‌గా మారనుంది. జగిత్యాలలో బీఆర్‌ఎస్‌ బలం మళ్లీ పుంజుకోవడానికి జీవన్ రెడ్డి రాక ఒక వరంలా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

Frequently Asked Questions

టీ. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారా?

అవును, టీ. జీవన్ రెడ్డి సుమారు 40 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

టీ. జీవన్ రెడ్డి బీఆర్‌ఎస్‌ పార్టీలో ఎప్పుడు చేరనున్నారు?

ఈ నెల 25న జగిత్యాలలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో టీ. జీవన్ రెడ్డి బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరనున్నట్లు సమాచారం.

జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఎందుకు వీడుతున్నారు?

పార్టీలో తనకు, తన అనుచరులకు తగిన గౌరవం, ప్రాధాన్యత లభించడం లేదని, కొత్తగా వచ్చిన వారికి ప్రాముఖ్యత ఇస్తున్నారని ఆయన అసంతృప్తితో ఉన్నారు.

జీవన్ రెడ్డి పార్టీ మారడం వల్ల కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

జీవన్ రెడ్డి నిర్ణయం కాంగ్రెస్‌కు పెద్ద షాక్ కాగా, బీఆర్‌ఎస్‌కు ఉత్తర తెలంగాణలో, ముఖ్యంగా జగిత్యాలలో బలం పెరగనుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: కాళేశ్వరం కూలడమే కేసీఆర్ అవినీతికి నిదర్శనం.. సీబీఐ విచారణ జరపాల్సిందే: సీఎం రేవంత్ రెడ్డి
కాళేశ్వరం కూలడమే కేసీఆర్ అవినీతికి నిదర్శనం.. సీబీఐ విచారణ జరపాల్సిందే: రేవంత్ రెడ్డి
Where is Harish Rao: కేసీఆర్ సభకు అందుబాటులో లేని హరీష్ రావు.. ట్రబుల్ షూటర్‌కు అంత ముఖ్యమైన పనేంటీ ?
కేసీఆర్ సభకు అందుబాటులో లేని హరీష్ రావు.. ట్రబుల్ షూటర్‌కు అంత ముఖ్యమైన పనేంటీ ?
KCR vs Revanth Reddy: తెలంగాణలో హైవోల్టేజ్ పాలిటిక్స్.. నేడు పోటాపోటీగా రేవంత్ రెడ్డి, కేసీఆర్ భారీ బహిరంగసభలు
తెలంగాణలో హైవోల్టేజ్ పాలిటిక్స్.. నేడు పోటాపోటీగా రేవంత్ రెడ్డి, కేసీఆర్ భారీ బహిరంగసభలు
Heatwave Warning: బయట తిరిగితే పోతారు.. జాగ్రత్త! ఎల్ నినో ప్రభావంతో ప్రాణాంతకంగా మారిన ఎండలు
బయట తిరిగితే పోతారు.. జాగ్రత్త! ఎల్ నినో ప్రభావంతో ప్రాణాంతకంగా మారిన ఎండలు
Advertisement

వీడియోలు

Vaibhav Suryavanshi Angry vs KKR IPL 2026 | వైరల్ అవుతున్న వైభవ్ ఔట్
KKR vs RR IPL 2026 Highlights | వరుస ఓటములకు చెక్ పెట్టిన కేకేఆర్
LSG vs PBKS IPL 2026 Highlights | చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్
IPL 2026 GT vs KKR Highlights | గుజ‌రాత్ హ్యాట్రిక్ విజ‌యం
IPL 2026 KKR vs Gujarat Titans Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Tamil Nadu Tour: ఎన్డీఏ సీఎం ప్రమాణస్వీకారానికి వస్తా - తమిళనాడులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఎన్డీఏ సీఎం ప్రమాణస్వీకారానికి వస్తా - తమిళనాడులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
AP Weather Updates: ఏపీలో వింత వాతావరణం - ఓవైపు వడగాలులు, మరోవైపు వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
ఏపీలో వింత వాతావరణం - ఓవైపు వడగాలులు, మరోవైపు వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
BRS Politics: జగిత్యాల కేసీఆర్ సభ సమయంలోనే డిల్లీకి హరీష్ - కాంగ్రెస్ మైండ్ గేమ్ షురూ !
జగిత్యాల కేసీఆర్ సభ సమయంలోనే డిల్లీకి హరీష్ - కాంగ్రెస్ మైండ్ గేమ్ షురూ !
Venkatrami Reddy dismissed: ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి డిస్మిస్ - ప్రభుత్వ సంచలన నిర్ణయం
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి డిస్మిస్ - ప్రభుత్వ సంచలన నిర్ణయం
Iran US War: బుధవారంతో కాల్పుల విరమణ ఒప్పందం ముగింపు - చర్చలకు ఇరాన్ నో - తర్వాత ఏం జరగబోతోంది?
బుధవారంతో కాల్పుల విరమణ ఒప్పందం ముగింపు - చర్చలకు ఇరాన్ నో - తర్వాత ఏం జరగబోతోంది?
Pachpadra Refinery: రూ. 79,450 కోట్ల రిఫైనరీ - మోదీ ప్రారంభించాల్సిన ముందురోజే బుగ్గి - ఎక్కడంటే?
రూ. 79,450 కోట్ల రిఫైనరీ - మోదీ ప్రారంభించాల్సిన ముందురోజే బుగ్గి - ఎక్కడంటే?
Purusha: సంసారాన్ని ఈదే సూపర్ హీరోస్... రెడీ అవుతున్న 'పురుషః' టీం
సంసారాన్ని ఈదే సూపర్ హీరోస్... రెడీ అవుతున్న 'పురుషః' టీం
Japan Tsunami Alerts: జపాన్‌లో 7.4 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ, 3 మీటర్ల ఎత్తుకు అలలు!
జపాన్‌లో 7.4 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ, 3 మీటర్ల ఎత్తుకు అలలు!
Embed widget