అన్వేషించండి

Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ

Potti Sriramulu Statue | అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు.

అమరావతి: భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం 58 రోజుల పాటు కఠోర దీక్ష చేసి, ఆత్మార్పణతో రాష్ట్రాన్ని సాధించి పెట్టిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని ఏపీ సీఎం చంద్రబాబు కొనియాడారు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్మరిస్తూ అమరావతిలోని శాఖమూరు వద్ద ఏర్పాటు చేసిన 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు దీక్షకు గుర్తుగానే 58 అడుగుల విగ్రహాన్ని 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఐరన్‌తో నిర్మించినట్లు తెలిపారు.


Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ

ఈ సందర్భంగా రాజధాని అమరావతి నిర్మాణానికి 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులను అభినందిస్తూ, గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర పునర్నిర్మాణానికి కట్టుబడి ఉందని, గోదావరి పుష్కరాల నాటికి పోలవరాన్ని జాతికి అంకితం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం తొలి అడుగు వేసిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు అని ప్రశంసించారు. ఆయన త్యాగానికి నివాళిగా రాష్ట్రంలో జల్‌జీవన్‌ మిషన్‌ పనులకు ‘అమరజీవి జలధార’గా నామకరణం చేశామన్నారు. నీళ్లు తాగినప్పుడు ఆయన మనకు గుర్తుకు రావాలన్నారు. తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడి విగ్రహాన్ని రాజధాని నడిబొడ్డున ఏర్పాటు చేయడం సంతోషదాయకమని పేర్కొన్నారు.


Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ

యువగళం హామీని నేరవేర్చాను.. మంత్రి నారా లోకేష్..

అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్మరిస్తూ, అమరావతిలోని శాఖమూరులో ఏర్పాటు చేసిన 'స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్' ఆవిష్కరణ మహోత్సవంలో మంత్రి నారా లోకేష్ ప్రసంగించారు. యువగళం హామీ నెరవేర్చానని లోకేష్ పేర్కొన్నారు.

అమరావతిలో 'స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్' ఆవిష్కరణ

పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతిని పురస్కరించుకుని, అమరావతిలో భారీ కాంస్య విగ్రహాన్ని ఈ విగ్రహం కేవలం ఒక శిల్పం మాత్రమే కాదని, తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీక అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. యువగళం పాదయాత్రలో ఆర్యవైశ్యులకు ఇచ్చిన హామీని కేవలం 194 రోజుల రికార్డు సమయంలోనే నెరవేర్చడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.


Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ

త్యాగానికి నిలువెత్తు రూపం

పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఆయన దీక్షా కాలాన్ని గుర్తు చేస్తూ ఈ విగ్రహాన్ని 58 అడుగుల ఎత్తులో నిర్మించారు. "ఒక మనిషి త్యాగం.. ఒక జాతి గౌరవం.. ఒక దీక్ష.. ఒక రాష్ట్రం" అంటూ లోకేష్ ఆయనను కొనియాడారు. ఈ విగ్రహం తెలుగువారి గొప్పతనాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

నిత్య పోరాట యోధుడు

పొట్టి శ్రీరాములుగారు ఎప్పుడూ పదవుల కోసం ఆశపడలేదని, సమాజాభివృద్ధి కోసం ఒక సామాన్య కార్యకర్తలా పనిచేశారని లోకేష్ గుర్తు చేశారు. గాంధీజీ అడుగుజాడల్లో నడిచి, స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా, అంటరానితనంపై పోరాడి దళితులకు ఆలయ ప్రవేశం కల్పించారని తెలిపారు. రాష్ట్రం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన ఆయన నిశ్చల దీక్షా దక్షత నేటి యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు.


Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ

భారతదేశ చరిత్రపై ప్రభావం

ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ పొట్టి శ్రీరాములు గారిని 'భారతదేశ మెర్కాటర్' గా అభివర్ణించారని లోకేష్ గుర్తు చేశారు. మెర్కాటర్ ప్రపంచ పటాన్ని రూపొందిస్తే, శ్రీరాములు గారి బలిదానం తర్వాతే భారతదేశ చిత్రపటంపై భాషా ప్రయుక్త రాష్ట్రాల రేఖలు ఏర్పడ్డాయని వివరించారు. ఆయన త్యాగం వల్లే నేడు మనం తెలుగువారిమని గర్వంగా చెప్పుకోగలుగుతున్నామని పేర్కొన్నారు.

స్మృతి వనం - భవిష్యత్తు ప్రణాళికలు

శాఖమూరులో 6.8 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ స్మృతి వనం మొదటి దశ పనులు పూర్తయ్యాయని, రాబోయే 12 నెలల్లో ఫోటో గ్యాలరీ, మ్యూజియం, మినీ థియేటర్, మరియు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ పనులు పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అలాగే, పొట్టి శ్రీరాములు గారి పేరు మీద స్మారక నాణెం విడుదల చేసేలా కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

NTR : చంద్రబాబుకు ఎన్టీఆర్ బర్త్ డే విషెష్ - మామయ్య గారు అంటూ...
చంద్రబాబుకు ఎన్టీఆర్ బర్త్ డే విషెష్ - మామయ్య గారు అంటూ...
AP Crime News: పాలు పొంగిపోయాయని కడపలో భర్త ఆత్మహత్య! సెల్‌ఫోన్ వాడొద్దన్నందుకు యువతి సూసైడ్
పాలు పొంగిపోయాయని కడపలో భర్త ఆత్మహత్య! సెల్‌ఫోన్ వాడొద్దన్నందుకు యువతి సూసైడ్
Delimitation: పునర్విభజన రాజకీయం - దక్షిణాదికి రక్షణ కవచమా? లేక రాజకీయ శిక్షా?
పునర్విభజన రాజకీయం - దక్షిణాదికి రక్షణ కవచమా? లేక రాజకీయ శిక్షా?
Kurnool Crime News: ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రిలో భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త
ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రిలో భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త
Advertisement

వీడియోలు

IPL 2026 GT vs KKR Highlights | గుజ‌రాత్ హ్యాట్రిక్ విజ‌యం
IPL 2026 KKR vs Gujarat Titans Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
IPL 2026 KKR vs GT Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
Shubman Gill GT vs KKR IPL 2026 | అదరగొట్టిన కెప్టెన్ శుభమన్ గిల్
Shubman Gill Success Secret Revealed IPL 2026 | శుబ్మన్ గిల్ సక్సెస్ సీక్రెట్ ఇదే
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delimitation: పునర్విభజన రాజకీయం - దక్షిణాదికి రక్షణ కవచమా? లేక రాజకీయ శిక్షా?
పునర్విభజన రాజకీయం - దక్షిణాదికి రక్షణ కవచమా? లేక రాజకీయ శిక్షా?
US Iran Peace Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ బృందం ఇస్లామాబాద్‌కు వెళ్లదా? చివర్లో ట్విస్ట్ ఇచ్చిన టెహ్రాన్
అమెరికాతో చర్చలకు ఇరాన్ బృందం ఇస్లామాబాద్‌కు వెళ్లదా? చివర్లో ట్విస్ట్ ఇచ్చిన టెహ్రాన్
KCR re entry: జగిత్యాల సభతో కేసీఆర్ రీ ఎంట్రీ - ఇక నుంచి మరో లెక్కనా?
జగిత్యాల సభతో కేసీఆర్ రీ ఎంట్రీ - ఇక నుంచి మరో లెక్కనా?
NTR : చంద్రబాబుకు ఎన్టీఆర్ బర్త్ డే విషెష్ - మామయ్య గారు అంటూ...
చంద్రబాబుకు ఎన్టీఆర్ బర్త్ డే విషెష్ - మామయ్య గారు అంటూ...
Ajinkya Rahane Record: కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే ఖాతాలో చెత్త రికార్డు.. ఐపీఎలో చరిత్రలోనే వరస్ట్ !
కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే ఖాతాలో చెత్త రికార్డు.. ఐపీఎలో చరిత్రలోనే వరస్ట్ !
Anshu Roja Selvamani: రోజాకు పుత్రికోత్సాహం...ఇండియానా యూనివర్సిటీలో టాప్ అవార్డ్ సాధించిన అన్షు రోజా సెల్వమణి
రోజాకు పుత్రికోత్సాహం...ఇండియానా యూనివర్సిటీలో టాప్ అవార్డ్ సాధించిన అన్షు రోజా సెల్వమణి
Project Punarvika: ప్రాజెక్ట్ పునర్విక ప్రకటించిన నారా లోకేష్.. అరుదైన వ్యాధులతో బాధపడే పిల్లల కోసం నిర్ణయం
ప్రాజెక్ట్ పునర్విక ప్రకటించిన నారా లోకేష్.. అరుదైన వ్యాధులతో బాధపడే పిల్లల కోసం నిర్ణయం
PM Modi Viral Video: సామాన్యుడిలా దుకాణం వద్ద రూ. 10 కి ఝాల్ ముడీ కొని తిన్న ప్రధాని నరేంద్ర మోదీ
సామాన్యుడిలా దుకాణం వద్ద రూ. 10 కి ఝాల్ ముడీ కొని తిన్న ప్రధాని నరేంద్ర మోదీ
Embed widget