అన్వేషించండి

Nandini Sidda Reddy : తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 

నందిని సిధారెడ్డి మెదక్ జిల్లాలోని బందారం గ్రామంలో జన్మించారు. తండ్రి నర్రా బాలసిద్ధారెడ్డి రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్ట్ యోధుడు కావడంతో చిన్నతనం నుంచే పోరాట పటిమ, సామాజిక స్పృహఉంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • డాక్టర్ నందిని సిధారెడ్డికి 'అనిమేష' వచన కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం.
  • కరోనా మహమ్మారి కాలపు సామాజిక పరిస్థితులను 'అనిమేష' కవితా సంపుటిలో చిత్రించారు.
  • తెలంగాణ ఉద్యమంలో పాటలు, ప్రజా ఉద్యమాలకు ఆయన ఊపిరి పోశారు.
  • తొలి తెలంగాణ భాషా సాహిత్య అకాడమీ చైర్మన్‌గా ఎందరో రచయితలను ప్రోత్సహించారు.

Nandini Sidda Reddy : తెలంగాణ మట్టి వాసనను, అస్తిత్వ కాంక్షను తన కలంతో ప్రపంచానికి చాటి చెప్పిన అక్షర యోధుడు, ప్రుఖ కవి డాక్టర్‌ నందిని సిధారెడ్డికి ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. 2026 సంవత్సరానికి గాను ఆయన రచించిన 'అనిమేష' అనే వచన కవితా సంపుటికి   ఈ గౌరవం దక్కినట్టు అకాడమీ ప్రకటించింది. తెలంగాణ సాహిత్య రంగానికి ఆయన చేసిన నిరుపామన సేవలకు, సుదీర్ఘ సాహిత్య కృషికి దక్కిన సరైన గౌరవంగా ఈ అవార్డును సాహితీ లోకం అభివర్ణిస్తోంది. 

'అనిమేష' కాలానికి పట్టిన అక్షర దర్పణం

ఈ పురస్కారం తెచ్చిపెట్టిన అనిమేష కవితా సంపుటి కేవలం అక్షరాల కూర్పు కాదు, అది ఒక కాలానికి సజీవ సాక్ష్యం. ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి కాలంలోని సామాజిక పరిస్థితులను, మానవీయ కోణాలను సిధారెడ్డి ఇందులో అద్భుతంగా చిత్రించారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రపంచ ఎదుర్కొన్న సంక్షోభాలను, మానవ సంబంధాల విచ్చిన్నత, వలస కూలీల కష్టాలు, సమాజంలో నెలకొన్న ఒంటరితనాన్ని ఈ సంపుటిలో ఆయన కళ్లకు కట్టారు. ఆపత్కాలంలో మనిషి ఎదుర్కొన్న ఆందోళనను, సామాజిక కలతలను ప్రతిబింబిస్తూనే, అందులోని ఆర్ద్రతను పాఠకులకు చేరువ చేశారు. ఈ అవార్డు కింద నందిని సిధారెడ్డికి లక్ష నగదు, తామ్రపత్రం, శాలువాను ప్రదానం చేయనున్నారు. 

 బందారం నుంచి భావ విప్లవం వరకు...

నందిని సిధారెడ్డి 1955లో మెదక్ జిల్లాలోని బందారం గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి నర్రా బాలసిద్ధారెడ్డి రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్ట్ యోధుడు కావడంతో సిధారెడ్డికి చిన్నతనం నుంచే పోరాట పటిమ, సామాజిక స్పృహ అబ్బాయి. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ పూర్తి చేసి ఆయన ఆధునిక తెలుగు కవిత్వంలో సూర్యుడు అనే అంశంపై 1981లో ఎంఫిల్‌ పట్టా పొందారు. అనంతరం ఆధునిక కవిత్వం, వాస్తవికత- అధివాస్తవికత అనే అంశంపై పరిశోధన చేసి 1986 పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. తన విద్యాభ్యాసం కాలం నుంచే అక్షరాన్ని ఆయుధంగా మార్చుకున్న ఆయన, తెలుగు సాహిత్యంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. 

తెలంగాణ ఉద్యమంలో అక్షరాయుధం

మలిదశ తెలంగాణ ఉద్యమంలో నందిని సిధారెడ్డి పాత్ర చిరస్మరణీయం. ఆయన రాసిన నాగేటి సాల్లల్ల నా తెలంగాణ వంటి పాటలు పల్లె పల్లెను కదిలించి, స్వరాష్ట్ర ఆకాంక్షను బలోపేతం చేశాయి. కేవలం కవిత్వం మాత్రమే కాకుండా ప్రజా ఉద్యమాలకు ఊపిరిపోసే శక్తిమంతమైన పాటలను ఆయన రచించారు. 

జైబోలో తెలంగాణ చిత్రంలోని ఒక పువ్వు ఒక నవ్వు ఉయ్యాలలూగేనా... బందూక్‌ చిత్రంలోని ఇది చరిత్ర ఇది పవిత్ర జనవిముక్తి సమరం, కొలిమి చిత్రలోని పుడమి పండుగ పువ్వుల జాతర వంటి రచనలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాయి. ముఖ్యంగా నాగేటి సాల్లల్ల నా తెలంగాణ పాట తెలంగాణ పల్లె జీవనాన్ని, ఆత్మను పలకరించి ఉద్యమాన్ని గొప్ప ఊపునిచ్చింది. 

సాహిత్య అకాడమీ తొలి చైర్మన్

తెలంగాణ రాష్ట్ర సిద్ధించిన తర్వాత భాషా సాహిత్య అకాడమీకి తొలి చైర్మన్‌గా నందిని సిధారెడ్డి సేవలు అందించారు. ఆ పదవిలో ఉంటూ ప్రాచీన సాహిత్యం నుంచి ఆధునిక సాహిత్యం వరకు అనేక గ్రంథాలను వెలుగులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. మెదక్ జిల్లా కేంద్రంగా మంజీరా రచయితల సంఘం స్థాపించి, ఎందరో వర్దమాన కవులను, రచయితలను ప్రోత్సహించారు. సాహిత్యానికి ప్రాంతీయతను అద్దడంలో ఆయనది ప్రత్యేక శైలి. ఈ సంఘం ద్వారా తెలుగు సాహిత్యంలో నూతనవాణినికి సామాజిక చైతన్యానికి ఒక గొప్ప వేదికగా కల్పించారు. 

ముఖ్య నేతల అభినందనలు 

నందిని సిధారెడ్డికి జాతీయ స్థాయి గుర్తింపు రావడం పట్ల తెలుగు రాష్ట్రాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ సంస్కృతికి వైభవాన్ని చాటిన కవి సిధారెడ్డి అని, ఆయన గొప్ప మానవతావాది అని కొనియాడారు. కరోనా కాలం నాటి సంక్షోభాలు ఆయన చిత్రించిన తీరు సమాజం పట్ల ఆయనకున్న నిబద్ధతను తెలియజేస్తుందని ప్రశంసించారు. నందిని సిధారెడ్డి తెలంగాణ గర్వించ దగ్గ కవి అని ఆయన కృషి రాష్ట్రానికి గర్వకారణమని మాజీ సీఎం కేసీఆర్ అభినందించారు. సిధారెడ్డికి పురస్కారం లభించడం తెలంగా సాహిత్యానికి దక్కిన గొప్ప గౌరవమని, ఇది ప్రతి తెలంగాణ పౌరుడికి గర్వకారణమని ట్వీట్  చేశారు. తెలంగాణ మట్టి పరిమళాన్ని జాతీయ స్థాయికి చేర్చిన మేధావి సిధారెడ్డి అని, ఆయన మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

Frequently Asked Questions

నందిని సిద్దారెడ్డికి ఏ పురస్కారం లభించింది?

డాక్టర్ నందిని సిద్దారెడ్డికి ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.

'అనిమేష' కవితా సంపుటి దేని గురించి వివరిస్తుంది?

'అనిమేష' కవితా సంపుటి కరోనా మహమ్మారి కాలంలోని సామాజిక పరిస్థితులను, మానవీయ కోణాలను, లాక్‌డౌన్‌ సమయంలో ప్రపంచం ఎదుర్కొన్న సంక్షోభాలను వివరిస్తుంది.

నందిని సిద్దారెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఎలా పాల్గొన్నారు?

నందిని సిద్దారెడ్డి 'నాగేటి సాల్లల్ల నా తెలంగాణ' వంటి పాటల ద్వారా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నందిని సిద్దారెడ్డి ఏ పదవిలో పనిచేశారు?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నందిని సిద్దారెడ్డి భాషా సాహిత్య అకాడమీకి తొలి చైర్మన్‌గా పనిచేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Matru Vandana Yojana: మహిళలకు రూ.11 వేలు ఆర్థిక సాయం.. పీఎం మాతృ వందన స్కీమ్ వివరాలివే!
మహిళలకు రూ.11 వేలు ఆర్థిక సాయం.. పీఎం మాతృ వందన స్కీమ్ వివరాలివే!
Hyderabad Crime News:పండ్ల రసమని మేనల్లుడితో యాసిడ్ తాగించిన మహిళ! ఎక్కువ ప్రేమ పొందుతున్నాడనే అసూయతో దారుణం!
పండ్ల రసమని మేనల్లుడితో యాసిడ్ తాగించిన మహిళ! ఎక్కువ ప్రేమ పొందుతున్నాడనే అసూయతో దారుణం!
Viral News: హైదరాబాద్‌ పీవీఆర్‌ మాల్‌లో ఉద్యోగి మృతిపై వివాదం! ఫుట్‌పాత్‌పై పడేేశారని ప్రచారం! ఖండించిన యాజమాన్యం
హైదరాబాద్‌ పీవీఆర్‌ మాల్‌లో ఉద్యోగి మృతిపై వివాదం! ఫుట్‌పాత్‌పై పడేేశారని ప్రచారం! ఖండించిన యాజమాన్యం
Telangana News: తెలంగాణలో మూడు రోజులు జాగ్రత్త! 'సన్‌'చలన అలర్ట్ జారీ చేసిన అధికారులు!
తెలంగాణలో మూడు రోజులు జాగ్రత్త! 'సన్‌'చలన అలర్ట్ జారీ చేసిన అధికారులు!
Advertisement

వీడియోలు

IPL 2026 RCB vs LSG Highlights | నాలుగో విజ‌యంతో స‌త్తా చాటిన బెంగుళూరు
Rasik Dar Salam vs LSG IPL 2026 | ఆర్‌సీబీ కొత్త సెన్సేషన్ రసిక్ సలామ్
Rishabh Pant Injury IPL 2026 vs RCB |నొప్పితో మైదానం వీడిన రిషబ్ పంత్
Virat Kohli Wins Orange Cap IPL 2026 | ఆరెంజ్ క్యాప్ అందుకున్న విరాట్ కోహ్లీ
Jasprit Bumrah Poor Form in IPL 2026 | ఐపీఎల్ 2026లో ముంబై స్టార్ బౌలర్ దారుణ వైఫల్యం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hormuz Strait Open: హార్మూజ్ జలసంధిని ఓపెన్ చేసిన ఇరాన్ - ఇక చమురు కష్టాలు తప్పినట్లే!
హార్మూజ్ జలసంధిని ఓపెన్ చేసిన ఇరాన్ - ఇక చమురు కష్టాలు తప్పినట్లే!
HUMBL బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించిన BRS..
HUMBL బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించిన BRS..
Prakash Raj : సినిమాల్లో సీఎం కావొచ్చు... పాలిటిక్స్‌లో కాదు - విజయ్‌పై ప్రకాష్ రాజ్ సెటైరికల్ కామెంట్స్
సినిమాల్లో సీఎం కావొచ్చు... పాలిటిక్స్‌లో కాదు - విజయ్‌పై ప్రకాష్ రాజ్ సెటైరికల్ కామెంట్స్
ISRO High Alert: అంతరిక్షంలో భారీగా ట్రాఫిక్ జామ్‌! భారతీయ ఉపగ్రహాలకు పొంచి ఉన్న ముప్పు! ఇస్రో హైఅలర్ట్!
అంతరిక్షంలో భారీగా ట్రాఫిక్ జామ్‌! భారతీయ ఉపగ్రహాలకు పొంచి ఉన్న ముప్పు! ఇస్రో హైఅలర్ట్!
Pakistan: పాకిస్తాన్‌లో ఉన్న భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టల వరుస హత్యలు - ధురంధర్ ప్లానేనా - వణికిపోతున్న శత్రుదేశం
పాకిస్తాన్‌లో ఉన్న భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టల వరుస హత్యలు - ధురంధర్ ప్లానేనా - వణికిపోతున్న శత్రుదేశం
Vishu poster controversy: కేరళ హోటల్ నిర్వాకం - శ్రీకృష్ణుడి చిత్రంతో మాంసాహార ప్రకటన - క్షమాపణ చెప్పినా ఊరుకుంటారా?
కేరళ హోటల్ నిర్వాకం - శ్రీకృష్ణుడి చిత్రంతో మాంసాహార ప్రకటన - క్షమాపణ చెప్పినా ఊరుకుంటారా?
Child born the day after marriage: పెళ్లయిన తర్వాత రోజే తల్లయిన పెళ్లి కూతురు - నిజంగానే - ఆ కొత్త పెళ్లి కొడుకు పరిస్థితేమిటి?
పెళ్లయిన తర్వాత రోజే తల్లయిన పెళ్లి కూతురు - నిజంగానే - ఆ కొత్త పెళ్లి కొడుకు పరిస్థితేమిటి?
Prakash Raj Ram controversy: రాముడు, లక్ష్మణులను వలస కూలీలతో పోల్చిన ప్రకాష్ రాజ్ - హిందూవాదుల తీవ్ర ఆగ్రహం
రాముడు, లక్ష్మణులను వలస కూలీలతో పోల్చిన ప్రకాష్ రాజ్ - హిందూవాదుల తీవ్ర ఆగ్రహం
Embed widget