Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
తెలంగాణలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ దిష్టి మాటల అగ్గి రాజుకుంటోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు మెల్లగా పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై అన్ని పొలిటికల్ పార్టీలు గొంతు వినిపిస్తున్నాయి. మాట్లాడటానికి పవన్ కి బుర్ర ఉండాలని కొందరు...పవన్ కళ్యాణ్ సినిమాలే తెలంగాణలో ఆపేస్తామని మరికొందరు..ఇలా ఎవరికి నచ్చిన స్టేట్మెంట్స్ వాళ్లు ఇచ్చేస్తున్నారు. యథాలాపంగా అన్నారో లేదా కావాలని అన్నారో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు మాత్రం ఇప్పుడు తెలంగాణలో పొలిటికల్ డిబేట్ గా మారిపోయాయి.
అసలేం జరిగింది అంటే నవంబర్ 26న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోనసీమలో పర్యటించారు. అక్కడ శంకరగుప్తంలో తలలు వాలిపోయిన, పడిపోయిన కొబ్బరి చెట్లను అన్నీ పరిశీలించారు. వాళ్లకైతే ఎలాంటి హామీలు ఇవ్వలేదు కానీ ఇష్యూను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. బట్ ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లోనే ఓ మాట ఉన్నారు. కోనసీమ అంటే ఎప్పుడూ పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది. అందరూ ఆ మాటనే కోట్ చేస్తుంటారు. తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా అక్కడి నాయకులు కోనసీమ చూడండి ఎలా పచ్చగా ఉందో మా పరిస్థితి ఇలా ఏడ్చింది అంటూ దిష్టి పెట్టేవారు. ఓ రకంగా తెలంగాణ ఉద్యమం రావటానికి కూడా కోనసీమ ఇంత అందంగా ఉండంటమే కారణమేమో అని కూడా ఉన్నారు. ఆ రకంగా తెలంగాణ వాళ్ల దిష్టి తగిలేసిందేమో అందుకే కొబ్బరి చెట్లన్నీ ఇలా అయిపోయాయి అంటూ కొన్ని కామెంట్స్ చేశారు. ఇదంతా జరిగింది నవంబర్ 26.
అయితే ఈ ఇష్యూపై ఆ రోజు ఎందుకో పెద్ద డిబేట్ జరగలేదు కానీ మూడు రోజుల తర్వాత అంటే 29 నవంబర్ న తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై ఫైర్ అయ్యారు. తెలంగాణ వాళ్లంతే నరదిష్టి పెట్టేవాళ్లలా కనిపిస్తున్నారా పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్లు కూడా పవన్ కళ్యాణ్ పై మాట్లాడారు. ఆయన ఏకంగా సినిమాటోగ్రఫీ మినిస్టర్ కాబట్టి కళ్యాణ్ ఈ ఇష్యూపై సారీ చెప్పకపోతే ఆయన సినిమాలు కూడా ఆపేస్తామని మాట్లాడారు. ఇప్పుడు డిసెంబర్ 3 వ తారీఖు కవిత వంతు వచ్చింది. బీఆర్ఎస్ నుంచి దీనిపై పైస్థాయి నేతలు అంతగా కామెంట్ చేయకపోయినా...కవిత మాత్రం ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు. 12ఏళ్లు గా తెలంగాణను అభివృద్ధి పథంలో నడుపుకుంటున్నాం. మేం ఎప్పుడూ పక్క వాళ్ల మీద పడి ఏడవలేదు. ఉద్యమం జరుగుతున్న టైమ్ లోనూ మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాడాం, ఇక్కడ యువత బలిదానాలు ఇచ్చుకుందే తప్ప ఇక్కడున్న ఆంధ్ర వాళ్లను ఒక్క మాట అనలేదు..ఇబ్బంది పెట్టలేదు...కచ్చితంగా పవన్ కళ్యాణ్ సారీ చెప్పాలి...మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయ్యారు.
సరే ఈ ఇష్యూను ఇప్పుడు పొలిటిసైజ్ చేసేందుకు అక్కడ వైసీపీ ఫిక్స్ అయ్యింది. అక్కడ లీడర్స్ పవన్ తీరుపై ఎప్పట్లానే మాట్లాడుతున్నారు. బట్ అసలు కోనసీమ ఇష్యూను డైవెర్ట్ చేసేందుకే పవన్ కళ్యాణ్ మాట్లాడారా...లేదా జనరల్ గా ప్రజల్లో ఉండే కామన్ మాటలా మన పంటలకు దిష్టి తగిలేసింది అని చెప్పాలనుకున్న సెన్స్ లో ఈ మాటలు వాడారా తెలియదు కానీ..ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై తెలంగాణ నేతలు ఫుల్ ఫైర్ అవుతున్నారు. సినిమాలు కూడా ఆపేస్తాం అంటున్నారు చూడాలి.





















