అన్వేషించండి

Chief Minister Chandrababu Naidu: బ్లాక్ చైన్ టెక్నాలజీతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు - హార్టికల్చర్ హబ్ సీమ - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Chandrababu Dhone Tour: గత ప్రభుత్వం ఇచ్చిన 19.93 లక్షల తప్పుడు పుస్తకాలను పక్కనబెట్టి, పక్కాగా క్యూఆర్ కోడ్ , బ్లాక్ చైన్ టెక్నాలజీతో ట్యాంపర్ ప్రూఫ్ పట్టాలను అందజేస్తున్నామని సీఎం ప్రకటించారు.

Chief Minister Chandrababu Naidu participated in the distribution of Pattadar passbooks:  నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలోని కొత్త బురుజులో నిర్వహించిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా అస్తవ్యస్తం చేసిందని  చంద్రబాబు మండిపడ్డారు. రైతుల భూములను ఇష్టానుసారంగా 22ఏ జాబితాలో పెట్టి వేధించారని, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా ప్రైవేట్ భూములపై పెత్తనం చలాయించాలని చూశారని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే ఆ నల్ల చట్టాన్ని రద్దు చేసి, భూ రికార్డుల్లోని తప్పులను సరిదిద్దుతున్నామని స్పష్టం చేశారు.

గత పాలకులు పాసుపుస్తకాలు, సర్వే రాళ్లపై ఫోటోలు ముద్రించుకుని ప్రజల జీవితాలతో ఆడుకున్నారని, ఇందుకోసం ఏకంగా రూ.750 కోట్లు వృథా చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం ఇచ్చిన 19.93 లక్షల తప్పుడు పుస్తకాలను పక్కనబెట్టి, ఇప్పుడు పక్కాగా క్యూఆర్ కోడ్ ,  బ్లాక్ చైన్ టెక్నాలజీతో కూడిన ట్యాంపర్ ప్రూఫ్ పట్టాలను అందజేస్తున్నామని తెలిపారు. ఒక్క రూపాయి అవినీతి లేకుండా, ప్రభుత్వమే ఉచితంగా రైతులకు కొత్త పట్టాదారు పుస్తకాలను పంపిణీ చేస్తోందని, ఎవరైనా రికార్డులు తారుమారు చేస్తే ఈ సాంకేతికత ద్వారా వెంటనే తెలిసిపోతుందని ఆయన వివరించారు.

రాయలసీమ అభివృద్ధిపై స్పందిస్తూ.. సీమను హార్టికల్చర్ హబ్  గా మారుస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. హంద్రీనీవా, గాలేరు నగరి వంటి ప్రాజెక్టులను ఎన్టీఆర్ ప్రారంభిస్తే, వాటిని పూర్తి చేసే అదృష్టం తనకు దక్కిందని చెప్పారు. డోన్ నియోజకవర్గంలో 30 చెరువులకు నీటిని అందించామని, భగీరథుని స్పూర్తితో ప్రతి ఎకరాకు నీళ్లివ్వడమే తన సంకల్పమని పేర్కొన్నారు. మామిడి రైతులకు కేజీకి రూ.4 సబ్సిడీ ఇవ్వడంతో పాటు, అంతర్జాతీయ మార్కెట్లో మెరుగైన ధర లభించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

రాష్ట్రంలోని శాంతిభద్రతల గురించి మాట్లాడుతూ.. సీమలో ఒకప్పుడు ఉన్న ముఠా తగాదాలను తుదముట్టించామని, గ్రామాల్లో ప్రశాంతతే ముద్దని తాము నమ్ముతున్నామని చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో మద్యం సిండికేట్లు, కల్తీ మద్యం వల్ల 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంపై సిబిఐ నివేదికను తప్పుగా ప్రచారం చేస్తున్నారని, స్వామివారి పవిత్రతను దెబ్బతీస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని కరాఖండీగా చెప్పారు. నేరాలు చేసి ఎదురుదాడి చేయడం వారి నైజమని విమర్శించారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ.. 'తల్లికి వందనం' కింద ప్రతి బిడ్డకు రూ.15 వేలు ఇస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ద్వారా ఇప్పటికే 50 కోట్ల ప్రయాణాలు పూర్తయ్యాయని సీఎం తెలిపారు. రాష్ట్రంలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, తమ ప్రభుత్వ హయాంలో కరెంట్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదని ప్రజలకు భరోసా ఇచ్చారు. అలాగే రోడ్లపై గుంతలు పూడ్చేందుకు రూ.4 వేల కోట్లు కేటాయించామని, వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలు పొందే నూతన విధానాన్ని అందుబాటులోకి తెచ్చామని చెప్పారు.         

రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం పెరుగుతోందని, కర్నూలులో  డ్రోన్ సిటీ , అనంతపురంలో  ఎయిరో స్పేస్ సిటీ  ఏర్పాటు చేయబోతున్నామని చంద్రబాబు వెల్లడించారు. ఇప్పటికే లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దామని, భవిష్యత్తులో మరో 5 లక్షల మందిని ఎంఎస్ఎంఈల ద్వారా ప్రోత్సహిస్తామని చెప్పారు. అభివృద్ధి కేవలం వైకుంఠపాళిలా ఉండకూడదని, పేదల సంక్షేమమే లక్ష్యంగా 'పీ4' విధానం ద్వారా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామని ముఖ్యమంత్రి  హామీ ఇచ్చారు .

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
YSRCP Assembly March: అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
YSRCP DSC Protests: ఏపీలో డీఎస్సీ సెగ!అక్రమాలు జరిగాయని  వైఎస్‌ఆర్‌సీపీ నిరసనలు! తాడిపత్రిసహా పలు చోట్ల తీవ్ర ఉద్రిక్తత!
ఏపీలో డీఎస్సీ సెగ!అక్రమాలు జరిగాయని  వైఎస్‌ఆర్‌సీపీ నిరసనలు! తాడిపత్రిసహా పలు చోట్ల తీవ్ర ఉద్రిక్తత!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
Embed widget