Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్న శుబ్మన్ గిల్ కు మరోసారి నిరాశ ఎదురయ్యింది. సిక్కిం పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ లో శుబ్మన్ గిల్ చివరి క్షణంలో మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా గిల్ మ్యాచ్ ఆడలేకపోయినట్లుగా తెలుస్తుంది. విజయ్ హజారే ట్రోఫీలో పంజాబ్ టీమ్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు శుబ్మన్ గిల్. ఈ టీమ్ లో శుభ్‌మన్ గిల్ తొపాటు అర్ష్‌దీప్ సింగ్ కూడా ఉన్నాడు. అనారోగ్యం కారణంగా గిల్ మ్యాచ్ ఆడలేకపోగా, అర్ష్‌దీప్ ఫైనల్ టీమ్ లో చోటు దక్కించుకున్నాడు.
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ లో ప్లేస్ కోల్పోయిన తర్వాత శుబ్మన్ గిల్ ఆడబోయే తొలి మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. టీ20లో గిల్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. సౌతాఫ్రికాతో జరిగిన తొలి మూడు టీ20ల్లో నిరాశపరచడంతో టీ20 వరల్డ్ కప్ టీమ్ దూరమయ్యాడు.
ఇండియా న్యూజీలాండ్ సిరీస్ కు ముందు దేశవాళీ క్రికెట్ తో శుబ్మన్ గిల్ ఫార్మ్ లోకి వస్తాడని అందరు అనుకున్నారు. కానీ అనారోగ్యం కారణంగా గిల్ మ్యాచ్ కు దూరమయ్యాడు. మరి ఇండియా న్యూజిలాండ్ మధ్య జరిగే వన్డే సిరీస్ లో ఎలా ప్రదర్శిస్తాడో చూడాలి.
ట్రెండింగ్ వార్తలు





















