IPL Hardik Drama: ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
గుజరాత్ టైటాన్స్ కు తిరిగి రావడానికి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ కండిషన్ పెట్టడంతో ఆ ఫ్రాంచైజీ మేనేజ్‌మెంట్ ఆఫర్‌ను రిజెక్ట్ చేసింది.

Hardik Pandya Rejected GT Return: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఫ్యూచర్ చుట్టూ కొత్త డ్రామా మొదలైంది. ముంబై ఇండియన్స్ టీమ్ నుంచి బయటకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్న హార్దిక్, ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ట్రేడింగ్ టాక్స్ జరిపినట్లు ప్రచారం సాగింది. తాజాగా తను పాత ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ (GT) వైపు కూడా మొగ్గు చూపినట్లు రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. జిటి యాజమాన్యం హార్దిక్‌ను టీమ్ లోకి తీసుకోవడానికి ఓకే చెప్పినప్పటికీ, అతడు పెట్టిన కెప్టెన్సీ కండిషన్ డీల్ క్లోజ్ అవ్వకుండా అడ్డుపడింది.
🚨 GT DENIED HARDIK PANDYA RETURN!
— Clutch Sports (@Clutchsportsz) August 12, 2026
Hardik Pandya discussed a possible return to Gujarat Titans.
However, GT rejected the move after Hardik made it conditional on being reinstated as captain.
The situation adds another twist to the Hardik Pandya trade saga.
(Indian Express) pic.twitter.com/ETF6X82F6g
గిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా నో చెప్పిన యాజమాన్యం
తాజా రిపోర్ట్ ప్రకారం, హార్దిక్‌ను రీ-ట్రేడ్ చేసుకోవడంపై గుజరాత్ టైటాన్స్ తమ ప్రెజెంట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కూడా డిస్కస్ చేసింది. గిల్ కూడా హార్దిక్ రాకకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ హార్దిక్ తనకు మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు ఇస్తేనే టీమ్ లోకి వస్తానని కండిషన్ పెట్టడంతో మేనేజ్‌మెంట్‌లో ప్రతీ ఒక్కరూ నో చెప్పారు. "ఫ్రాంచైజీ అతడిని తీసుకోవడానికి రెడీగా ఉంది, గిల్ కూడా ఒకే అన్నాడు. కానీ కెప్టెన్సీ డిమాండ్ చేయడంతో అందరూ రిజెక్ట్ చేశారు" అని ఒక ఆఫీషియల్ తెలిపాడు.
Once again it's very clear to everyone that wherever Hardik Pandya goes he'll demand captaincy. That's a non-negotiable part of his contract.
— Pratyush Halder (@pratyush_no7) August 12, 2026
That's why KKR is way ahead of other franchises at the moment. pic.twitter.com/bzHKXlnMLF
ప్రత్యక్షంగా చర్చలు జరపలేదన్న హార్దిక్ టీమ్
ఈ మ్యాటర్ పై హార్దిక్ పాండ్యా ప్రతినిధి స్పందిస్తూ, హార్దిక్ ఏ ఫ్రాంచైజీతో డైరెక్ట్ గా డిస్కషన్స్ జరపలేదని క్లారిటీ ఇచ్చాడు. ఏదైనా డీల్ లేదా ట్రేడింగ్ ఆఫర్ ఉంటే అది కేవలం ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ద్వారానే జరుగుతుందని చెప్పాడు. హార్దిక్ 2022 లో గుజరాత్ టైటాన్స్‌కు డెబ్యూ సీజన్‌లోనే టైటిల్ తెచ్చిపెట్టాడు. నెక్స్ట్ ఇయర్ కూడా టీమ్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌కు షిఫ్ట్ అయ్యాడు.
ముంబై ఇండియన్స్ లో ఫ్యాన్స్ అసంతృప్తి.. హెడ్ కోచ్ కామెంట్స్
ముంబై ఇండియన్స్‌లో రోహిత్ శర్మ ప్లేస్ లో కెప్టెన్‌గా రావడం వల్ల హార్దిక్ ఫ్యాన్స్ నుంచి తీవ్ర నిరసనలు ఎదుర్కొన్నాడు. ఎంఐ డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా రోహిత్‌కు ఉన్నంత రెస్పెక్ట్ హార్దిక్‌కు దక్కలేదని సమాచారం. ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన తర్వాత కొంతమంది సీనియర్ ప్లేయర్లు అన్‌కోచబుల్ అని కోచింగ్ స్టాఫ్ కామెంట్ చేయడంతో ఎంఐ టీమ్ రీబిల్డింగ్ మోడ్‌లోకి వెళ్లింది. ఆక్షన్ కి ముందు హార్దిక్‌ను వదిలేసే ఆలోచనలో ముంబై యాజమాన్యం ఉన్నట్లు సమాచారం.
Before You Go
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
ట్రెండింగ్ వార్తలు



















