Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
విజయ్ హజారే ట్రోఫీలో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా విశ్వరూపం చూపించాడు. బరోడా తరఫున బరిలోకి దిగిన హార్దిక్ పాండ్యా మెరుపు శతకం బాదేశాడు. లిస్ట్ A క్రికెట్‌లో ఇది హార్దిక్‌కు తొలి సెంచరీ కావడం విశేషం.
బరోడా టీమ్ 71 పరుగులకే 5 వికెట్లను కోల్పోయింది. 7వ స్థానంలో వచ్చిన హార్దిక్ పాండ్యా తన అన్న కృనాల్ పాండ్యాతో కలిసి 65 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఒకే ఓవర్లో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. 39వ ఓవర్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. హార్దిక్ పాండ్యా మొదటి 5 బంతుల్లో వరుసగా 5 సిక్సర్లు కొట్టగా, ఓవర్ చివరి బంతికి ఫోర్ కొట్టడంతో 100 పరుగులు పూర్తి చేశాడు. 66 పరుగులు చేయడానికి 62 బంతులు ఎదుర్కొన్న హార్దిక్ పాండ్యా.. 34 పరుగులు చేయడానికి కేవలం 6 బంతులు సరిపోయాయి. టీ20 వరల్డ్ కప్ ముందు డొమెస్టిక్ క్రికెట్లో టీమిండియా బ్యాటర్లు రాణించడం కలిసొస్తుంది. రోహిత్, కోహ్లీ లేకుండా ఆడుతున్న తొలి వరల్డ్ కప్ కావడంతో యువ ఆటగాళ్లపై ఒత్తిడి ఉండే అవకాశం ఉంది.





















