By: Geddam Vijaya Madhuri | Updated at : 29 Dec 2025 01:10 PM (IST)
LIC న్యూ జీవన్ శాంతి స్కీమ్ గురించి తెలుసా? ( Image Source : Other )
Retirement Planning with LIC New Jeevan Shanti : రిటైర్మెంట్ అనే మాట వినగానే.. ప్రతి నెలా ఖర్చులు ఎలా నడుస్తాయి అనే ప్రశ్న మొదట వస్తుంది. ఉద్యోగంలో ఉన్నప్పుడు జీతం వస్తూనే ఉంటుంది. కానీ రిటైర్మెంట్ తర్వాత క్రమమైన ఆదాయం ఉండటం చాలా ముఖ్యం. ఈ రోజుల్లో కేవలం పొదుపు సరిపోదు. సురక్షితమైన, గ్యారెంటీడ్ రిటర్న్స్ ఇచ్చే ప్లాన్ కావాలి. ఈ ఆలోచనను దృష్టిలో ఉంచుకుని LIC న్యూ జీవన్ శాంతి ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ పాలసీ వృద్ధాప్యంలో డబ్బు గురించి చింతించకూడదనుకునే వారి కోసం రూపొందించారు. ఒకసారి పెట్టుబడి పెడితే.. నిర్ణీత సమయం తర్వాత జీవితాంతం పెన్షన్ పొందవచ్చు. ఇదే ఈ ప్లాన్ అతిపెద్ద బలం.
రిస్క్ తీసుకోకూడదనుకునే పెట్టుబడిదారులకు LIC న్యూ జీవన్ శాంతి సరైనది. ఇది సింగిల్ ప్రీమియం యాన్యుటీ ప్లాన్. అంటే ఇందులో ప్రతి నెలా లేదా ప్రతి సంవత్సరం డబ్బు జమ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడతారు. పాలసీ తీసుకునే సమయంలోనే పెన్షన్ ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత మార్కెట్ పెరిగినా లేదా తగ్గినా.. మీ పెన్షన్‌పై ఎలాంటి ప్రభావం ఉండదు. ఉద్యోగులు, వ్యాపారస్తులు, రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్నవారు లేదా ఇప్పటికే రిటైర్ అయినవారు.. ఇలా అందరికీ ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో జీవితకాల ఆదాయానికి గ్యారెంటీ లభిస్తుంది.
ఈ పథకంలో LIC పాలసీదారులకు రెండు పెన్షన్ ఆప్షన్లను అందిస్తుంది. మొదటి ఆప్షన్ డెఫర్డ్ యాన్యుటీ ఫర్ సింగిల్ లైఫ్. ఇందులో పెన్షన్ కేవలం పాలసీదారునికి మాత్రమే లభిస్తుంది. వారి మరణానంతరం జమ చేసిన మొత్తం డబ్బు నామినీకి తిరిగి ఇస్తారు. రెండవ ఆప్షన్ డెఫర్డ్ యాన్యుటీ ఫర్ జాయింట్ లైఫ్. ఇందులో భార్యాభర్తలు లేదా ఇద్దరు సన్నిహిత బంధువులు చేరవచ్చు. ఒక వ్యక్తి మరణించిన తర్వాత.. మరొకరికి జీవితాంతం పెన్షన్ వస్తూనే ఉంటుంది. ఇద్దరూ మరణించిన తర్వాత.. పెట్టుబడి పెట్టిన మొత్తం నామినీకి తిరిగి ఇస్తారు.
LIC న్యూ జీవన్ శాంతిలో పెట్టుబడి పెట్టడానికి కనీస వయస్సు 30 సంవత్సరాలు ఉండాలి. గరిష్ట వయస్సు 79 సంవత్సరాలుగా నిర్ణయించారు. అందుకే ఈ ప్లాన్ యువతకు, సీనియర్ సిటిజన్లకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో కనీస పెట్టుబడి 1.5 లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. అయితే గరిష్ట పెట్టుబడికి ఎలాంటి పరిమితి లేదు. పాలసీలో 1 సంవత్సరం నుంచి 12 సంవత్సరాల వరకు డెఫర్‌మెంట్ పీరియడ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఎంత ఎక్కువ వేచి ఉండే కాలం ఉంటే.. అంత ఎక్కువ పెన్షన్ లభిస్తుంది. పాలసీ తీసుకున్న 3 నెలల తర్వాత దీనిపై లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది.
ఈ ప్లాన్‌లో లభించే పెన్షన్ మీ వయస్సు, పెట్టుబడి మొత్తం, ఎంచుకున్న డెఫర్‌మెంట్ పీరియడ్‌పై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి 55 సంవత్సరాల వయస్సులో 11 లక్షల రూపాయలు ఒకేసారి పెట్టుబడి పెట్టి.. 5 సంవత్సరాల డెఫర్‌మెంట్ పీరియడ్ ఎంచుకుంటే. ఫిక్స్డ్ టైమ్ పూర్తయిన తర్వాత అతనికి సంవత్సరానికి సుమారు 1,01,880 రూపాయల గ్యారెంటీడ్ పెన్షన్ రావడం మొదలవుతుంది. ఇదే పెన్షన్‌ను ప్రతి నెలా తీసుకుంటే.. మొత్తం సుమారు 8,149 రూపాయలు అవుతుంది.
Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?
Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
New Rules Change : ఎల్పీజీ, పీఎన్జీ నుంచి యూపీఐ వరకు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఐదు ప్రధాన మార్పులు!
కొత్త సంవత్సరం మొదటి రోజే షాక్ ఇచ్చిన బంగారం, వెండి! జనవరి 1 2026న మీ నగరంలో తాజా రేటు తెలుసుకోండి
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
This website uses cookies or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy