Mrithyunjay OTT : మృత్యుంజయ్ ఓటీటీ ప్లాట్ ఫాం ఫిక్స్ - ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Mrithyunjay OTT Platform : శ్రీవిష్ణు ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'మృత్యుంజయ్' ఓటీటీ ప్లాట్ ఫాం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 6న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Sree Vishnu's Mrithyunjay OTT Platform Locked : కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీవిష్ణు లేటెస్ట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'మృత్యుంజయ్'. శుక్రవారం ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండగా ఓటీటీ ప్లాట్ ఫాంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
'మృత్యుంజయ్' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ పూర్తైన తర్వాత ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. సాధారణంగా ఏ మూవీ అయినా థియేటర్లలో రిలీజైన 4 నుంచి 6 వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ మూవీ కూడా నెల రోజుల తర్వాత ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Also Read : వృషకర్మ ఫస్ట్ రివ్యూ - క్లైమాక్స్ ఇండియన్ సినిమాలో బెంచ్ మార్క్... నాగచైతన్య ఏం చెప్పారంటే?
ఈ మూవీలో శ్రీవిష్ణు సరసన రేబా మౌనిక హీరోయిన్‌గా నటించారు. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించగా... రచ్చ రవి, సిజ్జు, అయ్యప్ప, బాలాదిత్య, నంద గోపాల్, కృష్ణ కౌశిక్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. రమ్య గున్నం సమర్పణలో లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌పై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ఇప్పటివరకూ తనదైన కామెడీ టైమింగ్, నటనతో అలరించిన శ్రీవిష్ణు ఈ మూవీలో సీరియస్ లుక్‌లో సరికొత్తగా కనిపించారు.
మూవీ ఫస్ట్ రివ్యూ
'మృత్యుంజయ్' చాలా బాగుందని నేచరల్ స్టార్ నాని చెప్పారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఫస్ట్ రివ్యూ ఇచ్చారు. సినిమా మొదటి నుంచి లాస్ట్ వరకూ తనను కట్టి పడేసిందని... చాలా ఎంజాయ్ చేశానని తెలిపారు. మూవీలో విష్ణు రోల్ తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. మూవీ టీంకు విషెష్ చెప్పారు.
Enjoyed watching #Mrithyunjay kept me hooked till the end. We all know how good @sreevishnuoffl is with his comic timing and fun roles. This was a surprise and well done.
— Nani (@NameisNani) March 5, 2026
Congratulations dear @sunnygunnam on your maiden production. Always knew you would go for something…
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
























