Vizag Latest News: భార్యపై అనుమానంతో మూడేళ్ల బిడ్డ గొంతు కోసి అడవిలో విసిరేసిన విశాఖ టెక్కీ
Crime News: పూణేలో ఉద్యోగం చేస్తున్న ఓ వైజాగ్ వాసి తన మూడేళ్ల కుమారుడిని చంపేసి అడవిలో పడేశాడు. భార్యపై అనుమానంతో ఈ ఘాతుగానికి పాల్పడ్డాడు.

Pune Crime News: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌లో భర్తను చంపేసి డ్రమ్‌లో పెట్టి షికార్లు చేసిన భార్య ఘటన మరువక ముందే మరో దారుణం మహారాష్ట్రలో జరిగింది. భార్యపై అనుమానం ఉన్న వైజాగ్‌కు చెందిన వ్యక్తి కిరాతకంగా వ్యవహరించాడు. తన మూడేళ్ల కొడుకు గొంతుకోసి చంపేశాడు.
వైజాగ్‌కు చెందిన టెక్కీ మహారాష్ట్రలోని పూణేలో పని చేస్తున్నాడు. 38 ఏళ్ల ఈ టెక్కీ భార్యపై అనుమానపడ్డాడు. వివాహేతర సంబంధం పెట్టుకుందని సందేహించాడు. దీంతో మూడున్నర ఏళ్ల కొడుకు గొంతు కోసి చంపేశాడు. ఆ డెడ్‌బాడీని అడవిలో పడేశాడు. భర్త కుమారుడు కనిపించడం లేదని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని స్థానిక అటవీ ప్రాంతంలో గుర్తించారు. అతన్ని ప్రశ్నిస్తే షాకింగ్ విషయాలు చెప్పాడు.
పోలీసుల ప్రకారం... విశాఖపట్నం నుంచి వచ్చి పూణెలో సెటిల్ అయిన మాధవ్ ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. చాలా కాలంగా తన భార్య ప్రవర్తనపై అనుమానపడ్డాడు. ఈ విషయంలో భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. శుక్రవారం మధ్యాహ్నం కూడా ఇద్దరి మధ్య మరోసారి పెద్ద ఘర్షణ జరిగింది.
వివాదం తర్వాత, బిడ్డతో మాధవ్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అర్థరాత్రి దాటినా భర్త బిడ్డ రాకపోవడంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన చందన్ నగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
CCTV ఫుటేజ్‌లు పరిశీలించిన పోలీసులు మాధవ్ ఎటు వెళ్లాడో ఓ ఐడియాకు వచ్చారు. మరుసటి రోజు తెల్లవారుజామున చందన్ నగర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో అతను మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. తన కొడుకు ఎక్కడ ఉన్నాడనే దానిపై ప్రశ్నించగా అతన్ని తానే చంపినట్లు ఒప్పుకున్నాడు.
బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం
మాధవ్ చెప్పిన వివారల ప్రకారం పోలీసులు అడవిలో వెతికారు చివరకు గొంతు కోసి ఉన్న బాలుడి మృతదేహాన్ని కనుగొన్నారు. "నిన్న రాత్రి బాలుడి తల్లి పోలీస్ స్టేషన్‌కు వచ్చి తన కొడుకు కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో, బాలుడి తండ్రి లాడ్జిలో మద్యం తాగి ఉన్నట్లు తేలింది. మేము అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసాము. మరింత విచారణలో, అతను తన కొడుకును చంపినట్లు అంగీకరించాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని తదుపరి దర్యాప్తు జరుగుతోంది. అతనిపై హత్య కేసు నమోదు చేశాం" అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. బాలుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపారు. అధికారులు ఈ సంఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

