Sanjiv Goenka Scolding Rishabh Pant | DC vs LSG మ్యాచ్ ఓడిపోగానే పంత్ కు తిట్లు | ABP Desam
రిషబ్ పంత్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఢిల్లీ చేతిలో అనూహ్యంగా ఓడిపోయింది. విశాఖలో జరిగిన భారీ స్కోర్ మ్యాచ్ లో ఢిల్లీ ఒక వికెట్ తేడాతో సంచలన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ ఓటమి కంటే ఓడిపోయిన విధానానికి పంత్ బాగా బాధపడి ఉంటాడు. తనను ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా 27కోట్ల రూపాయల ధర ఇచ్చి కొనుక్కుంది లక్నో టీమ్. ఓనర్ సంజీవ్ గోయెంకా పంత్ ను వేలంలో దక్కించుకున్నప్పుడు చాలా సంబరపడిపోయారు. అలాంటి పంత్ మొదటి మ్యాచ్ లో డకౌట్ అయ్యాడు అది కూడా 6 బాల్స్ తిని. పోనీ దానికి వదిలేయొచ్చు. వికెట్ కీపింగ్ దారుణం. చాలా రన్స్ వదిలేశాడు వికెట్ల వెనుక పంత్. అశుతోష్ శర్మ ఔట్ చేసే అవకాశాన్ని రెండు సార్లు వదిలిపెట్టేశాడు. మోహిత్ శర్మను స్టంప్ అవుట్ చేయలేకపోయాడు. ఇలా అనేక కారణాలు ఉన్నాయి పంత్ ఫెయిల్యూర్స్ వెనుక. నిన్న మ్యాచ్ అవ్వగానే పంత్ తో LSG ఓనర్ సంజీవ్ గోయెంకా చాలా సీరియస్ గా మాట్లాడుతూనే ఉన్నారు. పంత్ కూడా మ్యాచ్ గురించి సుదీర్ఘంగా ఎక్స్ ప్లయిన్ చేస్తూ కనిపించారు. వాళ్లిద్దరీ మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్ నడుస్తున్నట్లు స్పష్టంగా కనిపించింది. మరంతేలే 27కోట్లు పెట్టిన ఓనర్ కి ప్లేయర్ ఫర్ ఫార్మ్ చేయకపోతే మండటంలో తప్పు లేదా కానీ పబ్లిగ్గా దట్టూ మొదటి మ్యాచ్ కే ఈ రేంజ్ లో క్లాస్ పీకటం ఏంటో ఆలోచించాల్సిందే.





















