search
×

Income Tax: కొత్త పన్ను విధానం ఎంచుకునే వాళ్లకు PPF, SSY, NPS పెట్టుబడులు ప్రయోజనమేనా?

Tax Saving Investments: జీతం, వ్యాపారేతర ఆదాయం ఉన్న వ్యక్తులు ప్రతి సంవత్సరం కొత్త & పాత పన్ను విధానాల మధ్య మారవచ్చు. పాత పన్ను విధానంలో చాలా మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవచ్చు.

FOLLOW US: 
Share:

Tax Saving In New Income Tax Regime: పాత పన్ను విధానం నుంచి కొత్త పన్ను విధానానికి మారే పన్ను చెల్లింపుదారులకు (Taxpayers) 80C, 80D, 80CCD (1) సెక్షన్ల కింద మినహాయింపులు లభించకపోవడం ఒక లోటుగా మారింది. కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే వాళ్లు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY), నేషనల్‌ పెన్షన్ సిస్టమ్ (NPS) వంటి స్కీమ్‌ల్లో పెట్టుబడి పెట్టాలా, వద్దా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

జీతం & వ్యాపారేతర ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారులు ప్రతి సంవత్సరం పాత పన్ను విధానం (Old Tax Regime) లేదా కొత్త పన్ను విధానం ‍(New Tax Regime)లో దేనినైనా ఎంచుకునే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం ఐటీ రిటర్న్‌ దాఖలు (ITR Filing) చేసేటప్పుడు ఎటువంటి ఆంక్షలు లేకుండా రెండింటిలో దేనినైనా ఎంచుకోవచ్చు.  

ఏప్రిల్ 01, 2025 నుంచి అమలులోకి వచ్చే కొత్త పన్ను విధానం కింద ఆదాయ పన్ను స్లాబ్‌లు: 

4 లక్షల రూపాయల వరకు వార్షిక ఆదాయంపై పన్ను ఉండదు
4 లక్షల నుంచి 8 లక్షల రూపాయల ఆదాయం ఉన్నవారికి 5 శాతం పన్ను
8 లక్షల నుంచి 12 లక్షల రూపాయల ఆదాయం ఉన్నవారికి 10 శాతం పన్ను
12 లక్షల నుంచి 16 లక్షల రూపాయల ఆదాయం ఉన్నవారికి 15 శాతం పన్ను
16 లక్షల నుంచి 20 లక్షల రూపాయల ఆదాయం ఉన్నవారికి 20 శాతం పన్ను
20 లక్షల నుంచి 24 లక్షల రూపాయల ఆదాయం ఉన్నవారికి 25 శాతం పన్ను
24 లక్షలకు పైగా వార్షిక ఆదాయం ఉంటే 30 శాతం ఆదాయ పన్ను చెల్లించాలి

పాత పన్ను విధానం కింద పన్ను స్లాబ్‌లు:

2,50,000 వరకు వార్షిక ఆదాయంపై పన్ను లేదు
2,50,001 నుంచి 5,00,000 రూపాయల వరకు ఆదాయంపై 5 శాతం పన్ను
5,00,001 నుంచి 10,00,000 రూపాయల వరకు ఆదాయంపై 20 శాతం పన్ను 
10,00,000 కంటే ఎక్కువ వార్షిక ఆదాయంపై 30 శాతం పన్ను చెల్లించాలి

పాత పన్ను విధానం కింద లభించే తగ్గింపులు
పాత ఆదాయ పన్ను విధానంలో, పన్ను చెల్లింపుదారులు వివిధ తగ్గింపులు & మినహాయింపుల ‍‌(Deductions & Exemptions) ప్రయోజనం పొందుతారు. PPF, ELSS, LIC ప్రీమియం వంటి నిర్దిష్ట చెల్లింపులపై ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్‌ 80C, 80D, 24B, 80CCD(1), 80CCD(2), 80CCD(1B), 80G, 80TTA, 80TTB కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.50 లక్షల వరకు మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. ఆరోగ్య బీమా కోసం చెల్లించిన ప్రీమియంలను సెక్షన్ 80D కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. సెక్షన్ 24(B) కింద, రూ. 2,00,000 వరకు గృహ రుణం వడ్డీపై పన్ను మినహాయింపు పొందవచ్చు. వీటితో పాటు, పన్ను ఆదా చేసుకోవడానికి HRA, LTA వంటి మరికొన్ని ఎంపికలు కూడా ఉన్నాయి.

కొత్త విధానం ఎంచుకునేవాళ్లకు పెట్టుబడులు అవసరమా?
టాక్స్‌ నిపుణులు చెబుతున్న ప్రకారం, “కేవలం పన్ను ప్రయోజనాలు పొందడానికి మాత్రమే పెట్టుబడులు పెట్టకూడదు. పెట్టుబడుల లక్ష్యం మిమ్మల్ని ఆర్థికంగా సురక్షితంగా ఉంచడం & దీర్ఘకాలంలో ఆర్థిక స్వేచ్ఛను సాధించడం. కొత్త పన్ను విధానంలో PPF, SSY, NPS వంటి పెట్టుబడులపై పన్ను మినహాయింపులు లేనప్పటికీ, అవి అందించే ఆర్థిక స్థిరత్వ ప్రయోజనాలు మాత్రం అందుతాయి. కాబట్టి, పదవీ విరమణ ప్రయోజనాలు పొందడానికి, రిస్క్-ఫ్రీ రిటర్న్‌లను దాఖలు చేయడానికి అలాంటి పెట్టుబడులు కొనసాగించాలి".

ఆర్థిక ప్రణాళికలో ఒక భాగంగా పన్ను ప్రణాళిక  ఉండాలి తప్ప, పన్ను ప్రణాళిక ఆధారంగా పెట్టుబడి వ్యూహాలు ఉండకూడదని కూడా మార్కెట్‌ నిపుణులు సూచిస్తున్నారు.

Published at : 24 Mar 2025 04:06 PM (IST) Tags: Income Tax Business News New Tax Regime Old Tax Regime

ఇవి కూడా చూడండి

Loan Against FD: ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఉంటే ఈజీగా లోన్‌, ఎఫ్‌డీని రద్దు చేసే పని లేదు

Loan Against FD: ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఉంటే ఈజీగా లోన్‌, ఎఫ్‌డీని రద్దు చేసే పని లేదు

Personal Loan Tips: మీ పర్సనల్ లోన్ అర్హతను మెరుగుపరుచుకునేందుకు ఈ 7 చిట్కాలు పాటించండి

Personal Loan Tips: మీ పర్సనల్ లోన్ అర్హతను మెరుగుపరుచుకునేందుకు ఈ 7 చిట్కాలు పాటించండి

Interest Rates Reduced: లోన్ తీసుకునేవాళ్లకు గుడ్‌ న్యూస్‌, ఈ బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించాయి

Interest Rates Reduced: లోన్ తీసుకునేవాళ్లకు గుడ్‌ న్యూస్‌, ఈ బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించాయి

Gold-Silver Prices Today 11 April: పసిడి రికార్డ్‌, 97,000 దాటిన రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

Gold-Silver Prices Today 11 April: పసిడి రికార్డ్‌, 97,000 దాటిన రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

Stock Market Opening: భారతీయ మార్కెట్లలో జోష్‌, సెన్సెక్స్‌ 1000pts జంప్‌ - గ్లోబల్‌ మార్కెటు డీలా పడ్డా బేఖాతరు

Stock Market Opening: భారతీయ మార్కెట్లలో జోష్‌, సెన్సెక్స్‌ 1000pts జంప్‌ - గ్లోబల్‌ మార్కెటు డీలా పడ్డా బేఖాతరు

టాప్ స్టోరీస్

AP Inter Results 2025: ఏపీ ఇంటర్ ఫలితాల్లో దుమ్మురేపిన కృష్ణా జిల్లా, చివరి స్థానంలో నిలిచిన చిత్తూరు

AP Inter Results 2025: ఏపీ ఇంటర్ ఫలితాల్లో దుమ్మురేపిన కృష్ణా జిల్లా, చివరి స్థానంలో నిలిచిన చిత్తూరు

TTD News: చెప్పులతో ఆలయంలోకి వెళ్లబోయిన భక్తులు - టీటీడీలో మరో వివాదం - తనిఖీల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందా ?

TTD News:  చెప్పులతో ఆలయంలోకి వెళ్లబోయిన  భక్తులు - టీటీడీలో మరో వివాదం - తనిఖీల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందా ?

Tamil Nadu: గవర్నర్‌తో పని లేకుండా చట్టాల నోటిఫై - దేశంలో తొలి సారి తమిళనాడు రికార్డు

Tamil Nadu: గవర్నర్‌తో పని లేకుండా చట్టాల నోటిఫై - దేశంలో తొలి సారి తమిళనాడు రికార్డు

Pawan Kalyan Son: పవన్ కల్యాణ్ కుమారుడ్ని కాపాడిన వారికి సింగపూర్ ప్రభుత్వ అవార్డులు - ఆ నలుగురు భారతీయులే!

Pawan Kalyan Son: పవన్ కల్యాణ్ కుమారుడ్ని కాపాడిన వారికి సింగపూర్ ప్రభుత్వ అవార్డులు - ఆ నలుగురు భారతీయులే!