Pawan Kalyan Son: పవన్ కల్యాణ్ కుమారుడ్ని కాపాడిన వారికి సింగపూర్ ప్రభుత్వ అవార్డులు - ఆ నలుగురు భారతీయులే!
Singapore Govt: సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో పిల్లల్ని కాపాడిన నలుగురు కార్మికులకు సింగపూర్ ప్రభుత్వం అవార్డులు ఇచ్చింది. వారు కాపాడిన వారులో పవన్ కల్యాణ్ కుమారుడు కూడా ఒకరు.

Singapore Pawan Kalyan Son : సింగపూర్‌లోని ఓ సమ్మర్ వెకేషన్ స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కుమారుడు సహా పదహారు మంది చిక్కుకున్నారు. వారిని వెంటనే స్పందించి.. సింగపూర్ లో అదే ప్రాంతంలో పని చేస్తున్న నలుగురు భారతీయ వలస కార్మికులు కాపాడారు. అలాగే నలుగురు పెద్దల్ని కూడా కాపాడారు. వీరందరికీ సింగపూర్ ప్రభుత్వం ప్రత్యేకంగా పురస్కారాలు అందించింది.
నలుగురు వలస కార్మికులకు అవార్డులిచ్చిన సింగపూర్ ప్రభుత్వం
స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 10 ఏళ్ల ఆస్ట్రేలియన్ బాలిక గాయపడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. మిగిలిన వారిని సకాలంలో ఆస్పత్రికి చేర్చడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వీరిని కాపాడిన వలస కార్మికులు ఇంద్రజిత్ సింగ్, సుబ్రమణియన్ శరణ్ రాజ్, నాగరాజన్ అన్బరసన్ , శివసామి విజయరాజ్‌లు గా గుర్తించారు. వీరందరికీ సింగపూర్ మానవ వనరుల శాఖ ఫ్రెండ్స్ ఆఫ్ ACE నాణేలను అందించారు.
పిల్లల అరుపులు విని వెంటనే పిల్లల్నికాపాడేందుకు సాహసం చేసిన నలుగురు
అగ్నిప్రమాదం జరిగిన భవనంలో పలు దుకాణాలు ఉన్నాయి. అలాగే సమ్మర్ స్కూల్ కూడా ఉంది. టొమాటో ఆనే ఆ వంట స్కూల్‌లో అగ్నిప్రమాదం తర్వాత పిల్లల అరుపులు విని, మూడవ అంతస్తులో ఉన్న కిటికీ నుండి దట్టమైన పొగ వెలువడుతున్నట్లు గమనించిన ఈ నలుగురు ఆలస్యం చేయకుండా సాయం చేసేందుకు వెళ్లిపోయారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా కిటీకీ గుండా లోపలికి వెళ్లిపోయారు. పిల్లలను ఒక్కొక్కరిగా కిటికీ వెలుపలకు అందించారు. నిజానికి వారికి ఎలాంటి రక్షణ చర్యలు అందుబాటులే లేవు అయినా రిస్క్ తీసుకుని పిల్లలను కాపాడారు.
డిఫెన్స్ ఫోర్స్ వచ్చే సరికే పది మంది రెస్క్యూ
సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ పది నిమిషాల తర్వాత వచ్చింది. అప్పటికి పది మంది పిల్లలను కాపాడారు. ముఖాలపై మసి మచ్చలతో ఉన్న పిల్లలు, దగ్గుతూ, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ సహాయం కోసం విలపిస్తున్న దృశ్యాన్ని తాను ఎప్పటికీ మర్చిపోలేనని సుబ్రమణియన్ శరన్‌రాజ్ సింగపూర్ మీడియాతో చెప్పారు. పిల్లల్ని కాపాడటానికి సాయం చేసిన మరో వ్యక్తి శరన్ రాజ్. లారీ డ్రైవర్. అక్కడే లారీ ఆపి సాయం చేశాడు. ఆ భవనంలో మెట్లు ఎక్కడ ఉంటాయో.. ఆ భవనం లోపల ఎలా ఉంటుందో కూడా తెలియదని కానీ..పిల్లల్ని రక్షించాలన్న లక్ష్యంతో ఏమీ ఆలోచించకుండా ప్రయత్నించామని మరో వ్యక్తి సరన్‌రాజ్ తెలిపారు.
అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతం న్యూటన్‌షో క్యాంప్ వద్ద ఉంది. టొమాటో కుకింగ్ స్కూల్, థియేటర్ స్కూల్ డ్రామా లామా , కోడింగ్ స్కూల్ మేకర్‌తో సహా న్యూటన్‌షో లాంటివి అక్కడ ఉన్నాయి. ధనవంతులు తమ పిల్లలను అక్కడ క్లాసులకు పంపుతూంటారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

