Pawan Kalyan: మార్క్ శంకర్ కాళ్లు, చేతులకు గాయాలు - ప్రమాద తీవ్రత మొదట తెలియలేదు - కుమారుడికి ప్రమాదంపై పవన్ భావోద్వేగం
Pawan Son: సింగపూర్ లో తన కుమారుడికి జరిగిన ప్రమాదంపై పవన్ కల్యాణ్ మాట్లాడారు. ప్రధాని మోదీ ఫోన్ చేశారని తెలిపారు. చిరంజీవి దంపతులతో సహా పవన్ సింగపూర్ వెళ్లనున్నారు

Pawan Kalyan Son Mark Shankar: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు సింగపూర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడ్డారు. సింగపూర్ లోని ఓ స్కూల్ సమ్మర్ క్యాంప్ లో ముఫ్పై మంది పిల్లలు ఉన్న సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనపై హైదరాబాద్‌లోని తన నివాసంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఉదయం అరకు పర్యటనలో ఉన్న ఫోన్ వచ్చిందన్నారు. అయితే మొదట ప్రమాద తీవ్రత తనకు తెలియలేదన్నారు. తర్వాత అది తీవ్ర ప్రమాదంగా తెలిసిందన్నారు. ఓ పసిబిడ్డ కూడా ఆ ప్రమాదంలో చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మార్క్ శంకర్ కాళ్లు, చేతులకు గాయాలు
మార్క్ శంకర్ కాళ్లు, చేతులకు కాలిన గాయాలు అయినట్లుగా తెలిసిందన్నారు. ప్రధాని మోదీ ఫోన్ చేసి ఏం జరిగిందో తెలుసుకున్నారని పవన్ తెలిపారు. మార్క్ శంకర్ ఆరోగ్యంపై ఆరా తీసిన చంద్రబాబు, లోకష్. జగన్ లకు పవన్ ధన్యవాదాలు తెలిపారు. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపైఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని.. పొగ ఊపిరి తిత్తుల్లోకి చేరిందని పవన్ తెలిపారు. దీర్ఘకాలంలో ఈ కారణంగా సమస్యలు వస్తాయని వైద్యులు అంచనా వేసినట్లుగా తెలిపారు. పవన్ కుమారుడు మార్క్ శంకర్‌ను చూసేందుకు చిరంజీవి దంపతులతో సహా పవన్ కల్యాణ్ ప్రత్యేక విమానంలో సింగపూర్ వెళ్లనున్నారు.
అకీరా పుట్టిన రోజునే ఇలా జరగడం బాధాకరమన్న పవన్
పెద్దకుమారుడు అకీరా నందన్ పుట్టిన రోజునే రెండో కుమారుడికి ఇలా జరగడం బాధ కలిగిస్తోందని పవన్ అన్నారు. ఇప్పుడు మార్క్ శంకర్ బ్రాంకో స్కోప్ చేస్తున్నారని పవన్ తెలిపారు. సింగపూర్ లో చదువుకుంటున్న పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు ఉదయం చిన్నపాటి ప్రమాదం జరిగిందని పవన్ కు సమాచారం వచ్చింది. స్కూల్ లో అగ్నిప్రమాదం జరగడంతో పొగ ఊపిరి తిత్తుల్లోకి వెళ్లిందని పవన్ కు సమాచారం ఇచ్చారు. అరకు పర్యటన పూర్తయిన తర్వాత పవన్ సింగపూర్ వెళ్లాలనుకున్నారు.
మొదట ప్రమాద తీవ్రత తక్కువే అనుకున్న పవన్
పర్యటన రద్దు చేసుకుని వెళ్లాలని పలువురు సూచించినప్పటికీ పవన్ .. కొన్ని గ్రామాలకు వస్తానని మాటిచ్చానని ఆ పర్యటన పూర్తి చేసుకునే వెళ్తానని పవన్ కల్యాణ్ చెప్పినట్లుగా తెలుస్తోంది. పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజ్‌నోవాతో పాటు పిల్లలు సింగపూర్ లో నే ఉంటున్నారు. అన్నా లెజ్‌నోవా కూడా అక్కడ చదువుకుంటున్నారు. అలాగే పిల్లల్ని కూడా అక్కడే చదివిస్తున్నారు. పవన్ కల్యాణ్ పిల్లలను మీడియాకు దూరంగా ఉంచుతున్నారు. చిన్న పిల్లలు కావడంతో వారి ప్రైవసీ కోసమే సింగపూర్ లో చదివిస్తున్నట్లుగా తెలుస్తోంది.
సింగపూర్ లో ఎలాంటి సాయం కావాలన్న ఏర్పాటు చేస్తానన్న మోదీ
ప్రధాని మోదీ పవన్ కల్యాణ్ కు ఫోన్ చేశారు. సింగపూర్ లో మార్క్ శంకర్ వైద్యం కోసం ఎలాంటి సాయం కావాలన్నా ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. పవన్ మోదీకి ధన్యవాదాలు తెలిపారు..





















