అన్వేషించండి

Dating App Scams : డేటింగ్ యాప్ స్కామ్స్​తో జాగ్రత్త.. ఆన్‌లైన్ డేటింగ్ చేస్తే ఈ విషయాలు గుర్తుంచుకోండి

Online Dating Warning : డేటింగ్ యాప్‌లో ప్రేమ కాదు మోసం కూడా ఉండొచ్చు. ఆన్‌లైన్ డేటింగ్​లో ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి? స్కామర్ల నుంచి ఎలా జాగ్రత్త పడాలో తెలుసుకుందాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • డేటింగ్ యాప్ స్కామర్లు నకిలీ ప్రొఫైల్స్ తో నమ్మకం గెలుచుకుంటారు.
  • వారి ఎమోషన్స్ తో డబ్బు, వ్యక్తిగత సమాచారం దోచుకుంటారు.
  • డబ్బు అడిగితే, అనుమానాస్పదంగా ఉంటే, వెంటనే నివేదించండి.

Online Dating Scams and Safety Tips : ఈ డిజిటల్ యుగంలో.. డేటింగ్ యాప్‌లు కొత్త వ్యక్తులను కలవడం, రిలేషన్స్ ఏర్పరచుకోవడాన్ని సులభం చేశాయి. చాలా మంది ఈ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా స్నేహం లేదా ప్రేమను వెతుకుతున్నారు. అయితే వీటితో పాటు ఈ డేటింగ్స్ యాప్ ద్వారా ఓ పెద్ద ప్రమాదం కూడా ముడిపడి ఉంది. అదే డేటింగ్ యాప్ స్కామ్. చాలా మంది మోసగాళ్లు నకిలీ ప్రొఫైల్‌లను క్రియేట్ చేసి ఇతరుల నమ్మకాన్ని గెలుచుకుంటారు. తరువాత వారి ఎమోషన్స్ ఉపయోగించుకుని డబ్బు లేదా వ్యక్తిగత సమాచారాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఇలాంటి పరిస్థితిలో ఆన్‌లైన్ డేటింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం.

ప్రొఫైల్‌ పూర్తిగా చెక్ చేయండి..

డేటింగ్ యాప్స్​లో లేదా ఆన్​లైన్​లో ఎవరితోనైనా మాట్లాడటం ప్రారంభిస్తే.. ముందుగా వారి ప్రొఫైల్‌ను జాగ్రత్తగా చూడండి. ఫోటోలు, బయో, సందేశ శైలిలో మార్పులు గమనించండి. కొన్నిసార్లు స్కామర్లు ఆకర్షణీయమైన ఫోటోలు ఉపయోగిస్తూ.. రియలిస్టిక్​గా స్టోరీలు చెప్తారు. దీనివల్ల ఎదుటి వ్యక్తి వారిని ఈజీగా, త్వరగా నమ్మేస్తారు. అలా కాకుండా అవతలి వ్యక్తిపై మీకు పూర్తిగా నమ్మకం కుదిరాకే.. మీ పర్సనల్ డేటా ఇవ్వాలి. అప్పటివరకు మీ ఇంటి చిరునామా, ఫోన్ నంబర్, బ్యాంకు డిటైల్స్ ఇవ్వకపోవడమే మంచిది. 

డబ్బు డిమాండ్ చేస్తే..

డేటింగ్ యాప్‌లలో మోసం చేసే వ్యక్తులు తరచుగా ఎమోషనల్ స్టోరీలు చెప్తారు. తమకి ఏదో కష్టం వచ్చిందంటూ డబ్బు సహాయం కోరతారు. అలాంటి కథలు వినడం సహజమే. కానీ.. మీరు ఆన్‌లైన్‌లో మాత్రమే తెలిసిన వ్యక్తికి డబ్బు పంపడం చాలా ప్రమాదకరం. నిజమైన సంబంధాలు నమ్మకం, గౌరవంపై ఆధారపడి ఉంటాయి. డబ్బు లావాదేవీలపై కాదు.

వీడియో కాల్ చేయండి.. 

ఎదురుగా ఉన్న వ్యక్తి నమ్మదగినవాడని మీరు భావిస్తే.. చాట్‌లకు పరిమితం కాకుండా వీడియో కాల్ చేయండి. ఇది ఎదురుగా ఉన్న వ్యక్తి నిజంగా అదే వ్యక్తి అని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. మీరు మొదటిసారిగా ముఖాముఖిగా కలవాలని అనుకుంటే మాత్రం బహిరంగ ప్రదేశాన్ని మాత్రమే ఎంచుకోండి. అలాగే మీరు ఎక్కడ, ఎవరిని కలవడానికి వెళుతున్నారో మీ స్నేహితుడు లేదా కుటుంబ సభ్యులకు తెలియజేయండి. సమావేశంలో ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తే.. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవడం మంచిది.

అనుమానాస్పదంగా ఉంటే

ఒక వ్యక్తి ప్రవర్తన మీకు అనుమానాస్పదంగా అనిపిస్తే.. అతనిచ్చిన సమాచారాన్ని ఇంటర్నెట్ లేదా సోషల్ మీడియాలో తనిఖీ చేయడానికి ప్రయత్నించండి. కొన్నిసార్లు కొంచెం శోధించడం ద్వారా ప్రొఫైల్ నిజమైనదా లేదా నకిలీదా అని తెలుసుకోవచ్చు. చాలా డేటింగ్ యాప్‌లు అనుమానాస్పద ప్రొఫైల్‌లను నివేదించడానికి ఒక ఎంపికను కూడా కలిగి ఉంటాయి. మీకు ఎవరిపైనైనా అనుమానం ఉంటే.. తప్పకుండా నివేదించండి. ఇది ప్లాట్‌ఫారమ్‌ను అలాంటి ఖాతాలపై చర్య తీసుకోవడానికి అనుమతిస్తుంది. ఇతర వినియోగదారులను మోసాల నుంచి రక్షించవచ్చు.

మిమ్మల్ని మీరు తెలుసుకోండి

ఆన్‌లైన్ డేటింగ్ చేసేటప్పుడు ఇతరుల గురించి కాకుండా మీ గురించి మీరు ముందుగా తెలుసుకోవాలి. ఎదుటివారు చెప్పేవి నిజమో.. కాదో తెలుసుకోవాలి. అలాగే డేటింగ్ స్కామ్స్​పై పూర్తి అవగాహన ఉండాలి. మీ భద్రత మాత్రమే మీకు ముఖ్యమని గుర్తించాలి. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో అనేది క్లారిటీ లేకుంటే వెంటనే వారితో మాట్లాడడం ఆపేయండి. ఎట్టి పరిస్థితుల్లో మీ పర్సనల్ డేటా షేర్ చేయకండి. ఇది మీరు సురక్షితంగా, నమ్మదగిన రిలేషన్​లో ఉండేందుకు హెల్ప్ చేస్తుంది.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Seifert, Phillips Carnage:  ప్ర‌త్య‌ర్థి బ్యాటర్ల ఊచకోతతో టీమిండియాకు మ‌రో ఓట‌మి.. ఐదో టీ20లో కివీస్ ఘ‌న విజ‌యం.. సత్తా చాటిన సీఫెర్ట్, ఫిలిఫ్స్, మిల్నే
ప్ర‌త్య‌ర్థి బ్యాటర్ల ఊచకోతతో టీమిండియాకు మ‌రో ఓట‌మి.. ఐదో టీ20లో కివీస్ ఘ‌న విజ‌యం.. సత్తా చాటిన సీఫెర్ట్, ఫిలిఫ్స్, మిల్నే
CM Revanth Reddy: రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి
రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
Lokesh Visits Raptadu Victim: రాప్తాడు బాలికకు లోకేశ్ పరామర్శ - మా బిడ్డలా భావించండి.. డాక్టర్లకు విజ్ఞప్తి !
రాప్తాడు బాలికకు లోకేశ్ పరామర్శ - మా బిడ్డలా భావించండి.. డాక్టర్లకు విజ్ఞప్తి !
Murasu Cyclone: దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం
దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Seifert, Phillips Carnage:  ప్ర‌త్య‌ర్థి బ్యాటర్ల ఊచకోతతో టీమిండియాకు మ‌రో ఓట‌మి.. ఐదో టీ20లో కివీస్ ఘ‌న విజ‌యం.. సత్తా చాటిన సీఫెర్ట్, ఫిలిఫ్స్, మిల్నే
ప్ర‌త్య‌ర్థి బ్యాటర్ల ఊచకోతతో టీమిండియాకు మ‌రో ఓట‌మి.. ఐదో టీ20లో కివీస్ ఘ‌న విజ‌యం.. సత్తా చాటిన సీఫెర్ట్, ఫిలిఫ్స్, మిల్నే
CM Revanth Reddy: రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి
రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
Lokesh Visits Raptadu Victim: రాప్తాడు బాలికకు లోకేశ్ పరామర్శ - మా బిడ్డలా భావించండి.. డాక్టర్లకు విజ్ఞప్తి !
రాప్తాడు బాలికకు లోకేశ్ పరామర్శ - మా బిడ్డలా భావించండి.. డాక్టర్లకు విజ్ఞప్తి !
Murasu Cyclone: దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం
దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం
YS Jagan Protest: పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
MG Motor Car Price Hike: ఈ 2 కార్ల ధరలు పెరిగాయి, కొనేముందు కొత్త ధరలు చెక్ చేసుకోండి
MG Motors 2 కార్ల ధరలు పెరిగాయి, కొనేముందు కొత్త ధరలు చెక్ చేసుకోండి
Anakapalli Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'అనకాపల్లి' - విలేజ్ రొమాంటిక్ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'అనకాపల్లి' - విలేజ్ రొమాంటిక్ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Dastagiri Intercepts Jagan: వివేకాను చంపించింది మీరే.. పులివెందులలో జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్న దస్తగిరి !
వివేకాను చంపించింది మీరే.. పులివెందులలో జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్న దస్తగిరి !
Embed widget