ఈ లక్షణాలు మీలో ఉంటే ఏ రిలేషన్​లో అయినా మీరే గ్రీన్ ఫ్లాగ్

Published by: Geddam Vijaya Madhuri

రిలేషన్స్​లో గ్రీన్​ ఫ్లాగ్స్​ అంటే సరైన వ్యక్తి అని అర్థం. వీరివల్ల బంధం ఎక్కువకాలం నిలుస్తుంది.

ఇంతకీ ఆ గ్రీన్ ఫ్లాగ్స్ ఏంటి? ఇవి ఎలా బంధాన్ని నిలబెడతాయి అంటే..

పార్టనర్ మాట్లాడుతుంటే శ్రద్ధగా విని.. వారి ఫీలింగ్స్ అర్థం చేసుకునే లక్షణం ఉంటుంది.

పార్టనర్ ఇష్టపడే చిన్న విషయాలను గుర్తుపెట్టుకుంటారు. వారి ఎమోషన్స్​కి రెస్పెక్ట్ ఇస్తారు.

మనసులో ఏముందో దానిని నిర్భయంగా, నిజాయితీగా, రెస్పెక్ట్​ ఇస్తూ కమ్యూనికేట్ చేస్తారు.

పార్టనర్​పై నమ్మకాన్ని పెట్టుకుంటారు. అంతే నమ్మకంగా వారు కూడా రిలేషన్​లో ఉంటారు.

పార్టనర్​ గోల్స్, డ్రీమ్స్​ని సాధించడానికి వీరు హెల్ప్ చేస్తారు. తోడుగా, అండగా ఉంటారు.

రిలేషన్​లో సమస్యలు వస్తే వాటిని గుర్తించి.. పరిష్కరించడానికి చూస్తారు. ఓపికగా ఉంటారు.

రిలేషన్​ షిప్​ని, పర్సనల్​ స్పేస్​ని రెండిటినీ బ్యాలెన్స్ చేయగలుగుతారు.

బంధాన్ని కాపాడుకోవడానికి కావాల్సిన ప్రతి ఎఫెర్ట్​ని ఎలాంటి బెరుకు లేకుండా పెడతారు.

సారీలతో సమస్య పెద్దది కాదనుకుంటే వెంటనే క్షమాపణ కోరుకుంటారు. (Images Source : Enavto)