ఉదయం వేళ వ్యాయామం చేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా? ఉదయం వ్యాయామం అనేక ప్రయోజనాలను అందిస్తుంది. శారీరక శ్రమకు అనువైన సమయం. ఉదయం వ్యాయామం చేయడం వల్ల ఫిట్‌నెస్ గా ఉంటాయి. ఉదయం వ్యాయామంతో కలిగే ప్రయోజనాలు చూద్దాం. ఉదయాన్నే ఆరుబయట వ్యాయామం చేస్తే శరీరం, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. స్వచ్చమైన గాలి పీల్చుకుంటాం. శారీరక శ్రమ ఎండార్ఫిన్లు, శక్తిని పెంచే ఇతర న్యూరోట్రాన్స్మిటర్లను విడుదల చేస్తాయి. రోజంతా యాక్టివ్ గా ఉంటాం. జీవక్రియను మెరుగ్గా ఉంచుతుంది. రోజంతా ఎక్కువ కేలరీలు బర్న్ చేయడంలో సహాయపడుతుంది. ఉదయం వ్యాయామం వల్ల బరువును అదుపులో ఉంచుకోవచ్చు. జీవక్రియని మెరుగుపరుస్తుంది. ఉదయం సహజ కాంతికి గురికావడం వల్ల రాత్రి నిద్ర బాగా పడుతుంది. అభిజ్నా పనితీరు, ఏకాగ్రత మెరుగుపడుతుంది. మానసికస్థితిని మెరుగుపరుస్తుంది. ఆకలిని నియంత్రిస్తుంది. ఉదయం వ్యాయామం ఇన్సలిన్ సెన్సిటివిటీతోపాటు రక్తంలో గ్లూకోజ్ నియంత్రణ మెరుగుపడుతుంది. టైప్ 2 డయాబెటిస్ రిస్క్ ఉండదు